Naga Panchami: భర్తను కాపాడేందుకు పంచమి ప్రాణ త్యాగం.. మరి మోక్ష ఏం చేయబోతున్నాడు?

నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ అదిరిపోయే ట్విస్ట్ లతో అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఎవరూ ఊహించని, అంచనాలకు అందని స్థాయిలో రసవత్తరంగా సాగుతోంది. ఓవైపు మోక్షను కాపాడుకోవాలని పంచమి, పంచమి పాముగా మారకుండా పిల్లాపాపలతో హాయిగా ఉండాలని మోక్ష ఉవ్విళ్లూరుతున్నారు. ఒకరి కోసం ఒకరు ప్రాణాలకు తెగించడానికి కూడా వెనుకాడడం లేదు. ఇదిలా ఉండగా మహా మృత్యుంజయ యాగాన్ని చెడగొట్టేందుకు నాగ దేవత.. మోక్షను వశ పరుచుకోవడానికి కరాళీ.. పంచిమికి అండగా సుబ్బు వారి వెంటనే ఉంటున్నారు.

అయితే తాజా ఎపిసోడ్ లో మోక్షను కాపాడుకోవడం కోసం కుటుంబ సభ్యులు అంతా కలిసి మహా మృత్యుంజయ యాగం జరిపించేందుకు నాగులవరానికి వచ్చారు. శివాలయం ముందే ఈ యాగం చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే కరాళీ మాత్రం పంచమి పాముగా మారగానే తన నుంచి విషం సేకరిస్తే.. మోక్షను ప్రాణాలతో కాపాడవచ్చని మోక్షకు చెబుతుంది. కానీ అందుకోసం నువ్వు నన్ను పూర్తిగా నమ్మాల్సి ఉంటుందని కరాళీ వివరిస్తుంది. అది సాధ్వమవుతుందో లేదో ఏది జరగాల్సి ఉంటే అదే జరుగుతుందని మోక్ష చెబుతాడు. ఇక ఆ తర్వాత పంచమి అక్కడకు వచ్చి భర్తతో మాట్లాడుతుంది.

Panchami Sacrifice To Save Moksha on December 7th Episode Number 220 in Naga Panchami Telugu Serial

ఇకపై మీకు ఎలాంటి శత్రువులు లేకుండా చేస్తాను, ఆ పాము ఇకపై మీ వెంట పడదు అంటూ భర్త మోక్షకు వివరిస్తుంది. అదేంటి పంచమి అలా అంటున్నావు.. నువ్వే కదా ఆ పాము అంటూ మోక్ష అనుమానం వ్యక్తం చేస్తాడు. అవును అని చెబుతూనే పంచమి.. తన లోపల తానే మాట్లాడుకుంటూ మరికొన్ని గంటల్లోనే తాను చనిపోతున్నట్లు చెబుతుంది. ఇంతటితో ఈరోజుటి ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా పంచమి తన ప్రాణాలు తీసుకొని సరే అయినా భర్తను కాపాడుకుంటానని చెబుతుంది.

ఇక ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇంట్లోకి రాగా.. అప్పటికే చిత్ర, జ్వాలలు రచ్చ చేస్తుంటారు. మహా మృత్యుంజయ యాగాన్ని మా ఇద్దరినే వదిలేసా వెళ్తారా.. ఎవరితోనైనా చంపించాలనుకుంటున్నారా అంటూ ఫైర్ అవుతారు. ఇలా చాలా సేపు గొడవ జరుగుతుంది. ఆ తర్వాత వారిద్దరి భర్తలతో పాటు పాపను అక్కడే వదిలి మిగిలిన వారు నాగుల వరం వెళ్లిపోతారు. అక్కడకు వెళ్లాకా ముందుగా శివుడిని దర్శించుకుంటారు. తమ మనసులోని కోరికలను అందరికీ వినిపించేలా చెబుతారు. మోక్ష తన భార్య సంతోషంగా ఉండాలని చెప్పగా.. శబరి తన మనవడు హాయిగా నిండు నూరేళ్ల పిల్లా పాపలతో కలిసి ఉండాలని కోరుకుంది.

ఆ తర్వాత మోక్ష తండ్రి.. తనకు మోక్ష అంటే ప్రాణం అని ఆయనను ప్రాణాలతో కాపాడాలని కోరుకుంటాడు. తల్లి కూడా అదే కోరికి చెబుతుంది. ఇక పంచమి వంతు రాగానే అంతా ఆమె కోరికను బయటకు చెప్పాలని అంటారు. అందుకు పంచమి భర్త ప్రాణాలు కాపాడాలని కోరడానికి బదులుగా.. తండ్రీ నన్ను నీలో ఐక్యం చేసుకో.. నా తొలి శ్వాస ఇక్కడే తీసుకున్నాను, నా తుది శ్వాస కూడా ఇక్కడే పోవాలని అంటుంది. అది విన్న అందరూ ఆశ్చర్యంతో చూస్తారు. ఆ తర్వాత పూజారి అందరికీ హారతి ఇస్తాడు.

Panchami Sacrifice To Save Moksha on December 7th Episode Number 220 in Naga Panchami Telugu Serial

ఇక చివరగా చిత్ర, జ్వాలలు మోక్ష ఇంటికి తిరిగి రాడని.. మోక్షను పాము కాటేయడం కచ్చితం అంటూ అనుకుంటారు. ఆ తర్వాత వారిద్దరి భర్తలు అక్కడకు వచ్చి ఏం వండారని అడగ్గా... ఓ పది రకాల నాన్ వెజ్ ల పేర్లు చెప్తారు. దీంతో డైనింగ్ టేబుల్ వద్దకు పరిగెత్తి చూడగా.. ఖాళీగా ఉంటాయి. మేము అవన్నీ ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నామంటూ జ్వాల చెప్పగా.. భర్త షాకవుతాడు.. మరి మాకు అనగా మీకు లేదని అంటారు. దీంతో మేం బయటకెళ్లి తినేసి వస్తామని అంటారు. మరి మాకు తేరా అంటే తీసుకురామని చెప్పగానే.. ఫుడ్ బాలేకపోతే ఏం చేస్తారంటే బయటకెళ్లి తింటామంటారు. మరి బెడ్ ఇవ్వకపోతే ఏం చేస్తారగానే బయట ఎంజాయ్ చేస్తామని వివరిస్తారు. దీనికి ఫైర్ అయిన చిత్ర, జ్వాలలు కత్తులతో భర్తల మీదకు వస్తారు. ఇక పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X