Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాహుల్ ముద్దుకు సిగ్గుపడ్డ అషూ.. పోస్ట్ తొలగించడంతో అనుమానాలు.. దగ్గరవుతున్న బంధం!
బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత రెండు సీజన్స్‌లో కంటే ఎక్కువ మంది కంటెస్టెంట్లు పాపులర్ అవ్వడం, నెగెటివిటీ తక్కువగా వ్యాప్తి చెందడంతో మూడో సీజన్ అందరినీ ఆకట్టుకుంది. దాదాపు కంటెస్టెంట్లందరికీ మంచి పేరే వచ్చింది. హిమజ, శివజ్యోతి, అషూ, రోహిణి, రవికృష్ణ, వరుణ్ సందేశ్, వితికా, పునర్నవి, రాహుల్, మహేష్ ఇలా ప్రతీ ఒక్కరికీ మంచి పేరే వచ్చింది. అంతకు ముందున్న పాపులార్టీ కంటే మరింత క్రేజ్ వచ్చింది.
ఆ
ముగ్గురు
లేకపోతే
లోకమే
లేదు..
ఆ
పని
మాత్రం
కచ్చితంగా
చేస్తా..
రాహుల్
సిప్లిగంజ్
కామెంట్స్
గ్యాంగ్‌లుగా వేరైనా..
ప్రతీ సీజన్లో ఉన్నట్టే ఈ మూడో దాంట్లోనూ గ్యాంగ్‌లు ఏర్పడ్డాయి. ఎన్నో గ్యాంగ్‌లు ఉన్నా చివరి వరకు నిలిచింది మాత్రం పీవీవీఆర్ (పునర్నవి, వరుణ్, వితికా, రాహుల్). ఈ గ్యాంగ్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఆ నలుగురిలో ఏ ఒక్కరూ నామినేట్ అయినా సరే.. ఈ గ్యాంగ్‌కు ఉన్న సపోర్ట్‌తో ఈజీగా సేవ్ అవుతూ వచ్చారు.
పునర్నవి-రాహుల్ కెమిస్ట్రీ..
మూడో సీజన్ మొత్తంలో పునర్నవి-రాహుల్ కెమిస్ట్రీనే హైలెట్‌గా నిలిచింది. చీటికిమాటికి తిట్టుకోవడం, కొట్టుకోవడం, అలగడం, కోప్పడటం, అన్నం తినుపించుకోవడం ఇలా అన్నింటా వీరిద్దరూ తమ ముద్రను వేశారు. ఏదో నడుస్తుందనే అనుమానాన్ని నాగార్జున కూడా వెల్లిబుచ్చేవాడు.
పునర్నవికి దూరం..?
రాహుల్, పునర్నవి.. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. అయినా సరే వారిద్దరిపై ప్రేమ, పెళ్లి అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా నిశితంగా పరిశీలిస్తే.. పునర్నవి ఊసే ఎత్తడం లేదు రాహుల్. పునర్నవి కూడా రాహుల్ గురించి ఎక్కడా మాట్లాడినట్టు కనిపించడం లేదు. చూస్తుంటే వీరిద్దరికి గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తోంది.
దగ్గరవుతున్న బంధం..
ఇదే సమయంలో అషూ రెడ్డికి దగ్గరవుతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి బాగానే హల్చల్ చేస్తున్నారు. ఈ మధ్య మేమంతా ప్రేమలో ఉన్నాము అని కామెంట్ చేస్తూ అషూ, రాహుల్, తన ఇద్దరు స్నేహితులు ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోను ఇప్పుడు రాహుల్ డిలీట్ చేయడంపై మరిన్ని అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.
Recommended Video
టిక్ టాక్ వీడియో వైరల్..
అషూ రెడ్డికి డబ్ స్మాష్ అన్నా, టిక్ టాక్ అన్నా ఎంతో ఇష్టమని తెలిసిందే. అషూ ఫేమస్ అయింది కూడా ఆ డబ్ స్మాష్తోనే. తాజాగా రాహుల్‌తో చేసిన టిక్ టాక్ తెగ వైరల్ అవుతోంది. రాహుల్ గాల్లో ఓ ముద్దు ఇవ్వడం, ఆ ముద్దుకు అషూ అదిరిపోయే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం హైలెట్‌గా నిలిచింది. చూస్తుంటే వీరి వ్యవహారరం ముదిరేట్టు కనిపిస్తోంది.