ఆమె మాట్లాడితే బూతులే.. జబర్దస్త్ యాంకర్‌పై కమెడియన్ షాకింగ్ కామెంట్స్
Photo Courtesy: ETV Telugu India
గత 13 ఏళ్లుగా తెలుగువారిని నవ్వుల్లో ముంచెత్తుతోంది జబర్దస్త్ కామెడీ షో. ఎంతోమంది ప్రతిభావంతులు ఈ వేదిక ద్వారా పరిచయమై తమ టాలెంట్‌ను నిరూపించుకున్నారు. జబర్దస్త్‌లో పనిచేసిన వారు వెండితెరపై మంచి స్థానాల్లో ఉన్నారు. ఈ 13 ఏళ్లలో కమెడియన్లు, యాంకర్లు, జడ్జిలు మారినా జబర్దస్త్ నేటికీ నెంబర్ వన్ కామెడీ షోగా తెలుగు నాట దూసుకెళ్తోంది. అయితే అనసూయ భరద్వాజ్ జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత పలువురు యాంకర్లుగా వచ్చారు. అయితే వీరిలో సౌమ్యారావు నడిగ్ ఎంట్రీపై పలు అభ్యంతరాలు వచ్చాయి. కర్ణాటకకు చెందిన ఓ అమ్మాయిని తెలుగు షోకి యాంకర్‌ను చేయడం ఏంటీ అంటూ పెదవి విరిచారు. కానీ సౌమ్యారావు తన ప్రతిభ, అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమెపైనా పలువురు విమర్శలు చేశారు.
కొద్దినెలల క్రితం స్టార్ యాంకర్ సుమ నిర్వహించిన ఓ ఈవెంట్‌లో బుల్లితెర సెలబ్రిటీలంతా సందడి చేశారు. ఈ సందర్భంగా కొందరి ఫోటోలను అతికించి వారందరినీ వేదిక మీదకి పిలిచింది సుమ. న్యూఇయర్ సందర్భంగా మీ రెజిల్యూషన్ చెప్పడం కాదు.. పక్కవాడి రెజిల్యూషన్ చెప్పాలి, అంటే వాళ్లలో ఏ మార్పు వస్తే మంచిది అనేది చెప్పి వారి ఫోటోను ఈ నిప్పుల కొలిమిలో వేయాలని టాస్క్ ఇచ్చింది సుమ. తొలుత ఇమ్యాన్యుయేల్‌ను పిలవగా .. ఆమె అరియానా ఫోటోను మంటల్లో వేసి తను ఏమనుకుంటున్నాడో చెప్పాడు. ఆ తర్వాత హైపర్ ఆది వచ్చి రీతూ చౌదరిలో ఎలాంటి మార్పు రావాలో తెలిపాడు.

Photo Courtesy: ETV Telugu India
అయితే నూకరాజు ఎంట్రీతో వాతావరణం హీటెక్కిపోయింది. నాడు జబర్దస్త్ యాంకర్‌గా ఉన్న సౌమ్యారావు నడిగ్ ఫోటోను తీసుకొచ్చి మంటలు రేపాడు. కన్నడ నుంచి వచ్చి తెలుగులో యాంకరింగ్ చేస్తున్నారు. మనం ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు ఆ పని మనకి తెలుసుంటే అర్ధం. ఆవిడ వచ్చి తెలుగు తెలిసి తెలియక ఏదిపడితే అది మాట్లాడటం, అది బూతులుగా మారడం జరిగింది. నవ్వుకునే వరకు బాగానే ఉంటుంది.. కానీ నా ఉద్దేశం ప్రకారం కొద్దో గొప్పో అయినా తెలుగు నేర్చుకోవాలి కదా.. నేర్చుకుంటే ఈ తెలుగు షోలో ప్లస్ అవుతుందని నా ఫీలింగ్. వచ్చే ఏడాది నాటికైనా మీరు తెలుగు నేర్చుకుని మంచి మంచి షోలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని నూకరాజ్ అన్నాడు.
కానీ నూకరాజు వ్యాఖ్యలతో సౌమ్యారావు హర్ట్ అయ్యింది. ఆ వెంటనే మైక్ అందుకుని ఎప్పుడు చూసినా వేరే స్టేట్ వాళ్లు.. కన్నడవాళ్లు వస్తారు, తెలుగు తెలియదు అని లోగా చూస్తారు అని ఫైర్ అయ్యింది. నా మాతృభాష కన్నడ.. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నిల్చొని ఇలా మాట్లాడుతున్నానంటే అది చాలా గొప్ప విషయమని సౌమ్యారావు కౌంటర్ ఇచ్చింది. ఆ వెంటనే నూకరాజు మాట్లాడుతూ.. మీ ప్రోమోలు మీరు చూశారో లేదో మీరు పదిమాటలు మాట్లాడితే.. 8 బూతులు వస్తాయని అన్నాడు.
మీరు కూడా కన్నడలోకి వచ్చి చేస్తే తెలుస్తుందని సౌమ్యారావు అనగా.. నాకు రానప్పుడు నేను వెళ్లనని తేల్చేస్తాడు నూకరాజు. అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు నన్ను ఈ షోకి పిలవొద్దు.. మీ తెలుగు వాళ్లనే పిలుచుకోండి, నాకు తెలుగు రాదు నాకు వచ్చినంతలో నేను చేస్తున్నానని ఎమోషనల్ అయ్యింది. ఈ ఇష్యూ పక్కదారి పడుతూ ఉండటంతో యాంకర్ సుమ కనకాల జోక్యం చేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఏ భాష వాళ్లయినా సరే కళాకారుల్ని ఆదరిస్తుంటారు. ఇక్కడ తెలుగు భాషలో నేను ఒక మలయాళీని అయ్యుండి ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానంటే దాని అర్ధం ఎంతో ప్రేమ, అభిమానం వల్లే. ఎవరో ఏదో అన్నారని నువ్వు మనసులో పెట్టుకోకు.. నువ్వేం చేయాలని అనుకుంటున్నావో అది చేయమని సుమ ఆమెను హత్తుకుని ఓదార్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications



