Brahmamudi బ్రహ్మముడి సీరియల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
బుల్లితెర సీరియల్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఎన్ని సినిమాలు, సిరీసులు వచ్చినా... బుల్లితెరపై సీరియల్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. సాయంత్రం అయిందంటే చాలు.. సామాన్యులంతా టీవీలో సీరియల్స్ చూస్తూ గడిపేస్తారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ఇటీవల కాలంలో అందరూ సీరియల్స్ ను ఇష్టపడుతున్నారు. అందుకు తగ్గట్లే సీరియల్స్ ను రూపొందిస్తున్నారు మేకర్స్. ఇక స్టార్ మా టీవీలో ప్రసారం అయ్యే బ్రహ్మముడి, కృష్ణ ముకుందా మురారీ సీరియల్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సీరియల్స్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది స్టార్ మా టీవీ. అదేంటో ఈ స్టోరీలో చూసేద్దాం.
కనెక్ట్ అవ్వాల్సిందే...
స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న సీరియల్స్ కు మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రైమ్ టైంలో టెలికాస్ట్ అయ్యే సీరియల్స్ కు ప్రముఖ్యత ఎక్కువగా ఉంటుంది. అయితే స్టార్ మాలో అప్పట్లో కార్తీక దీపం సీరియల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఈ సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. టీవీలకు అతుక్కు పోయేలా చేసింది. ఇప్పటికీ కార్తీక దీపం వంటలక్క, డాక్టర్ బాబు అంటే జనాల్లో క్రేజ్. ఆ పాత్రలకు అంతలా కనెక్ట్ అయిపోయారు.

సీరియల్స్ కు బ్రహ్మరథం...
ఇక ఆ సీరియల్ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రసారం అయ్యేది. ఆ టైమింగ్ కు ప్రేక్షకులు బాగా అలవాటు పడిపోయారు. ఇక కార్తీక దీపం తర్వాత ఆ ప్లేసులోకి బ్రహ్మముడి సీరియల్ వచ్చి చేరింది. బిగ్ బాస్ ఫేం మానస్, కన్నడ నటుడు దీపికా ప్రధాన పాత్రల్లో ఈ సీరియల్ తెరకెక్కింది. ఇక ఈ సీరియల్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 7.30 నిమిషాలు అయితే చాలు టీవీకి అతుక్కు పోయి సీరియల్ వీక్షిస్తున్నారు.
సీరియల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్...
అయితే ఈ సీరియల్ ఫ్యాన్స్ కు స్టార్ మా టీవీ గుడ్ న్యూస్ చెప్పింది. బ్రహ్మముడి సీరియల్ టైమింగ్ ను పెంచింది. మామూలుగా సీరియల్ 20 నిమిషాలు టెలికాస్ట్ అవుతుంది. మిగతా పదినిమిషాలు యాడ్స్ వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ సీరియల్ టైమింగ్ 45నిమిషాలకు పెంచింది. స్టార్ మా టీవీ ఎక్స్ ట్రా వినోదం పేరిట బ్రహ్మముడి, కృష్ణ ముకుందా మురారి సీరియల్స్ టైమింగ్ పెంచేసింది. వచ్చే వారం అనగా 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ రెండు సీరియల్స్ గంటన్నర పాటు టెలికాస్ట్ కానున్నాయి.
Niharika Konidela నిహారిక కొణిదెల రెండో పెళ్లి... షాకింగ్ పోస్ట్ పెట్టిన మాజీ భర్త
నాగపంచమి కూడా ఛేంజ్...
అయితే బ్రహ్మముడి, కృష్ణ ముకుందా మురారి సీరియల్స్ మధ్యలో నాగపంచమి అనే సీరియల్ టెలికాస్ట్ అయ్యేది. అయితే ఆ సీరియల్ టైమింగ్ చేంజ్ చేశారు. నాగపంచమి సీరియల్ ను సాయంత్రం 6 గంటలకు మార్చారు. దీంతో వచ్చే వారం నుంచి నాగపంచమి సీరియల్ 6 గంటలకు ప్రసారం కానుంది. ఇక దీనితో పలు సీరియల్ మొత్తం టైమింగ్ చేంజ్ అయ్యాయి. మగువ ఓ మగువా సీరియల్ సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ కానుంది.
గేమ్ ఛేంజర్ సీరియల్ ఎంట్రీ...
మామగారు సీరియల్ మధ్యాహ్నం 1 గంటకు మార్చారు. ఇక 7 గంటలకు నువ్వు నేను ప్రేమ సీరియల్ మాత్రం ఎప్పటిలాగానే టెలికాస్ట్ కానుంది. అయితే ఈ టైమింగ్ ఛేంజ్ వెనుక ఓ గేమ్ ఛేంజర్ సీరియల్ రాబోతుంది. అదేంటో కాదు కార్తీక దీపం 2 సీరియల్. ఇది 7.30 నుంచి 9 గంటల మధ్యలో 8 గంటలకు ప్రసారం కానుందని.. అందుకే వారం పాటు బ్రహ్మముడి, కృష్ణ ముకుందా మురారి సీరియల్స్ టైం పెంచారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications










