Naga Panchami: ఫణీంద్రకు సుబ్బు షాక్.. అలా మారే వరకు పంచమిని వేధించొద్దట.. అయినా వినని యువరాజు!
నాగ పంచమి పంచమి సీరియల్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు. రోజుకో ట్విస్ట్ తో అద్భుతంగా సాగుతున్న ఈ సీరియల్ ను చూసేందుకు ప్రేక్షకులు కూడా తెగ ఉవ్విళ్లూరుతున్నారు. రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈరోజుటి ఎపిసోడ్ లో ముందుగా.. సుబ్బు వద్దకు ఆయన వాహనం నెమలి వస్తుంది. నెమలి అక్కడకు రాగానే.. సుబ్బు ఏంటని అడుగుతాడు. భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి పంచమి అంతగా ప్రయత్నిస్తుంటే... మోక్ష మాత్రం పిల్లల కోసం ప్రాణాలకు తెగించాలనుకుంటున్నాడు ఎందుకని ప్రశ్నిస్తాడు. అందుకు సుబ్బు.. మోక్ష అలా చేసేది పిల్లల కోసం కాదని.. పంచమి ఇకపై పాముగా మారకూడదని చెబుతాడు.
పాముగా మారకుండా.. ఈలోకంలోనే ఉంచేసి ఆమె హాయిగా ఉండేలా చేసేందుకే తన ప్రాణ త్యాగానికి ఒడిగడుతున్నాడని వివరిస్తాడు. ఇది తెలుసుకున్న నెమి.. వీరి ప్రేమను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందని.. కానీ వీరు కలిస్తే మోక్ష చనిపోవడం ఖాయం కదా అని అంటాడు. అవును కానీ విధి కూడా ప్రేమకు తలవంచాల్సిందే. కాలమే వీరి ప్రేమకు, పరీక్షలకు సమాధానం చెబుతుందని సుబ్బు అంటాడు. ఇక ఆ తర్వాత నెమలి వెళ్లిపోతాడు. ఇక ఆ తర్వాత పంచమి వాంతులు చేసుకుంటూ కనిపిస్తుంది. పక్కనే ఉన్న శబరి ప్రేమగా ఆమెను చూస్తుంది.

అలాగే డైనింగ్ టేబుల్ పై కూర్చొని పంచమి మామిడి కాయ ముక్కులు తింటుంది. ఆ వెంటనే శబరి ఆమెకు ప్రేమగా అన్నం తనిపించడం, పంచమి ఓ పెద్ద డిష్ పట్టుకొస్తుంటే నువ్వు పనులు చేయొద్దని కూర్చోబెట్టడం చూపిస్తారు. అక్కడే ఉన్న మోక్ష.. వచ్చి నీకు పుట్టబోయేది ముని మనవడు కాదు నీ భర్త అంటూ శబరికి చెప్పగా ఆమె మురిసిపోతుంది. అయితే ఇదంతా మోక్ష కల కంటాడు. తాను చనిపోయినా.. శబరి పంచమికి ఏ లోటూ రానివ్వద్దని.. పంచమి కూడా తన కొడుకులో తనను చూసుకుంటూ బతికేస్తుందని అనుకుంటాడు. ఎలాగైనా సరే పంచమిని ఇందుకు ఒప్పించి ఆమెను తల్లిని చేయాలని నిర్ణయించుకుంటాడు.
దీని తర్వాత పంచమి.. మేడపై నిలబడి భర్త మాటలు గుర్తు చేసుకుంటూ బాధ పడుతూ ఉంటుంది. తనతో భర్త కలిస్తే ఆయన ప్రాణాలు పోతాయని తెలియక ఇలా చేస్తున్నాడనుకొని.. తనకు భర్త ప్రాణాలే ముఖ్యం అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడకు ఫణీంద్ర వస్తాడు. చావు సమయంలో మోక్ష ఇలాంటి చావు తెలివితేటలు వస్తున్నాయని.. మిమ్మల్ని నేను అస్సలే కలవనివ్వను అంటాడు. వచ్చే పౌర్ణమి వరకు మాత్రమే మీరు పక్క పక్కన ఉంటారని.. ఆ తర్వాత మిమ్మల్ని నాగ లోకానికి తీసుకెళ్తానని చెబుతూ పంచమిని భయపెడతాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోతాడు.
ఈక్రమంలోనే కిందకు వచ్చిన ఫణీంద్రకు సుబ్బు ధ్యానం చేసుకుంటూ కనిపించగా అక్కడకు వెళ్తాడు. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో మీ దర్శన భాగ్యం నాకు కల్గిందంటూ ఫణీంద్ర చెప్పగా... ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం మరే జన్మలోనో ఫలిస్తుంది, కానీ ఈ జన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలోనే వెంటాడుతుందని అంటాడు. పంచమిని నాగ లోకానికి తీసుకెళ్లడం నా కర్తవ్యం అని అందుకు మీరు సాయం చేయాలంటూ ఫణీంద్ర సుబ్బుతో అంటాడు. దైవం ఎప్పుడూ న్యాయం వైపే ఉంటుందని.. పంచమి పాముగా మారితేనే మీ యువరాణి అని, అప్పటి వరకు ఆమెను వేధించడం సరికాదని చెబుతాడు. ఇలా వీరిద్దరి మధ్య కాసేపు చర్చ సాగగా.. ఫణీంద్ర వెళ్లిపోతాడు.
Bigg Boss Telugu 7: ఈవారం నామినేషన్స్‌లో టాప్ కంటెస్టెంట్లు.. డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సే లేదు!
ఆ తర్వాత పంచమి గదిలో ఉండగా.. మోక్ష అక్కడకు వెళ్తాడు. రేపటి నుంచి మనది ఒకటే కంచం, ఒకటే మంచం.. పాలు నీళ్లలా కనిపిసిపోవాలని మోక్ష అంటాడు. మంచి చీర కట్టుకో ఫొటోల్లో మనం చాలా బాగా రావాలంటూ చెప్పి ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. ఇంతటితో ఈరోజుటి ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో.. నాగలోకపు యువరాజు ఫణీంద్ర సోది పలికే వాడిగా వచ్చి.. మోక్షకు చావు తప్పదని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు అంతా తెగ టెన్ఠన్ పడిపోతున్నారు. అలాగే పంచమి తప్పిపోయి భూలోకంలో పుట్టిందని... ఆమె నాగమ్మ తల్లి అంశ అంటూ వివరించాడు. పంచమి ఇక్కడున్నంత కాలం మోక్షకు ప్రాణ గండం అని ఆయన ప్రాణాలు పోవాల్సిందేనంటూ హెచ్చరించాడు.


Click it and Unblock the Notifications











