Bigg Boss Telugu 7 శివాజీ బిజ్జాల దేవుడు..శోభాశెట్టితో అలాంటి రిలేషన్.. టేస్టీ తేజ
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో 10వ వారంలోకి ప్రవేశించింది. 9వ వారంలో ఇంటి నుంచి ఎలిమినేట్ అయి వచ్చిన కంటెస్టెంట్ టేస్టీ తేజ. ఊహించని విధంగా టేస్టీ తేజ ఇంటి నుంచి బయటకు రావడం కొందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎలిమినేషన్ తర్వాత స్టార్ మా నిర్వహించే బిగ్‌బాస్ బజ్‌లో తన మనసులో అభిప్రాయాలను పంచుకొంటూ ..
బిగ్‌బాస్ నుంచి ఆఫర్ రాగానే వెంటనే వెళ్లిపోవాలని అనుకొన్నాను. ఇంటిలో కనీసం 4 వారాలు ఉండాలని నిర్ణయించుకొన్నాను. బిగ్‌బాస్ తెలుగు షోలోకి వెళ్లే ముందు బట్టలు కొనుక్కొంటే.. అన్ని బట్టలు ఇంటిలో వేసుకోమని మా అమ్మ చెప్పింది. దాంతో నేను 4 వారాలు ఉంటానని అమ్మకు చెప్పాను. నాలుగు వారాలు ఉందామని వెళ్లిన నేను 9 వారాలు ఉన్నాను అని టేస్టీ తేజ అన్నాడు.

బిగ్‌బాస్ తెలుగు 7 ఇంటిలో 4 వారం, 7వ వారం, 9వ వారం నేను ఇంటిలో ఉంటే 15వ వారం కూడా ఇంటిలో ఉంటానని అనుకొన్నాను. 9వ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయాను. నేను ముందుగానే ఎలిమినేషన్ కోసం ప్రిపేర్ అయ్యాను. నేను ఎలిమినేట్ అయ్యానని బాధపడలేదు అని టేస్టీ తేజ చెప్పాడు.

శోభా శెట్టితో నాకు ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉంది. డేటింగ్ టాస్క్‌లో టాటూ వేసుకోమని చెబితే.. సీరియస్ అనుకొన్నాను. కానీ అది జోక్ అని తర్వాత తెలిసింది. ఆ విషయం గురించి ఫన్నీగా నాగార్జున గారితో కూడా షోలో డిస్కస్ చేశాను. నాగ్ టాటూ వేసుకోమని అంటే.. శోభా చెబితే వేసుకొంటానని స్టేజ్ మీదే అన్నాను. అంతకు మించి మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. ఇంటిలో జరిగిన గొడవల కంటే.. మా ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి అని టేస్టీ తేజ చెప్పాడు.
ఇంటిలో గ్రూపిజం లేదు. ఆ రోజు ఎవరితో కనెక్ట్ అయితే వారు కలిసి ఉంటారు. నామినేషన్ సందర్భంగా శోభా, ప్రియాంక మధ్య ఎలాంటి డిస్కషన్ జరుగలేదు. గేమ్ ఆధారంగానే నేను నామినేట్ చేశాను. నేను వేసిన నామినేషన్స్‌తోనే అందరూ ఎలిమినేట్ అయ్యారంటే నా తప్పు కాదు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరుగుతుంది అని టేస్టీ తేజ చెప్పారు.

శివాజీ బిజ్జాలదేవుడు అని నేను అన్నాను. ఆయన ముందే నేను చెప్పాను. ఆయన వెనుక నేను చెప్పలేదు. శివాజీ అంటే నాకు గౌరవం ఉంది. ఆయన నాకు తండ్రి లాంటి వారు. నా తండ్రి వయసు కూడా అంతే.. ఆ విషయాన్ని నేను ఆయనతో చెప్పాను అని టేస్టీ తేజ అన్నారు.


Click it and Unblock the Notifications











