This Week Movie Releases: కంగనతో మనోజ్ బాజ్‌పేయ్ ఢీ.. తెలుగులో ఈ వారం చిన్న సినిమాలదే హవా

వేసవి ముగిసి జూన్ వచ్చేసింది. తొలి వారంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన పెద్ది ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మరి ఈ వారం ఏయే సినిమాలు విడుదల కానున్నాయి. పెద్ద సినిమాల సందడి ఉందా? చిన్న సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సి ఉందా? తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ఇంగ్లీష్ భాషలలో ఈ వీక్ రిలీజ్ కానున్న సినిమాలు పరిశీలిస్తే..

సింగ్ గీతం:
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన మూవీ సింగ్ గీతం. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అహిల్య బమ్రూ, అయాన్, షాలినీ కొండెపూడి, శివ నారాయణ, బెనర్జీ, వామ్కీ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. అంకుర్ సీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. సంగీతం ప్రధానంగా సాగే ఈ సినిమా జూన్ 11న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.

This Week Movie Releases Sing Geetham Bharat Bhhagya Viddhaata and more filims coming on theaters

పోలీస్ కంప్లైంట్:
వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర కీలకపాత్రలలో తెరకెక్కిన మూవీ పోలీస్ కంప్లైంట్. ఎంఎస్కే ప్రమదీ షీ ఫిల్మ్స్ బ్యానర్‌పై మాకినేని కృష్ణ సాయి నిర్మించగా.. సంజీవ్ మెగోటీ దర్శకత్వం వహించారు. రాగిణి ద్వివేది, కృష్ణసాయి, బాబ్లూ పృథ్వీరాజ్, జెమిని సురేష్, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి, ఆదిత్య ఓం, అమిత్ తివారి, రాజశ్రీ నాయర్, శరత్ లోహిత్సవ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఎస్ఎన్ హరీశ్ సినిమాటోగ్రాఫర్‌గా, అనుగోజు రేణుకబాబు ఎడిటర్‌గా వ్యవహరించారు. ఆరోహణ సుధీంద్ర, సుధాకర్ మరియో, సంజీవ్ మెగోటీలు సంగీతం అందించారు. హార్రర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన పోలీస్ కంప్లైంట్ మూవీ జూన్ 12న తెలుగు, కన్నడ భాషలలో విడుదల కానుంది.

కొత్త మలుపు
ప్రముఖ సింగర్ సునీత తన కుమారుడు ఆకాష్‌ గోపరాజు హీరోగా నటిస్తోన్న మూవీ కొత్త మలుపు. ఈ సినిమాలో ఆకాష్ సరసన భైరవి ఆర్ధ్యా హీరోయిన్‌గా నటిస్తున్నారు. కొత్త మలుపు చిత్రానికి కే. శివప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేందర్, ప్రభావతి, రఘుబాబు, పృథ్వీ, కిట్టయ్య తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తథాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తాటి బాలకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. మునుగాల అనూష సమర్పిస్తున్నారు. యశ్వంత్ నాగ్ సంగీతం అందిస్తుండగా.. సుమంత్ కాచర్ల, జవహార్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌, శివ శర్వాణీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 12న కొత్త మలుపు మూవీని విడుదల చేయనున్నారు.

భారత భాగ్య విధాత:
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ తాజాగా నటించిన మూవీ భారత భాగ్య విధాత. 26/11 ముంబై దాడుల సమయంలో కొందరు నర్స్‌లు తమ ప్రాణాలకు తెగించి రోగులను ఎలా కాపాడారన్న ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కించారు. మణికర్ణిక ఫిల్మ్స్, పరంహన్స్ క్రియేషన్స్, యూనియా ఫిల్మ్స్, ఫ్లోటింగ్ రాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై కంగనా రనౌత్, శైలేష్ ఆర్ సింగ్, ధావల్ గడ, బబిత ఆశివాల్, ఆది శర్మలు నిర్మించగా మనోజ్ తపాడియా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గిరిజా ఓక్ గాడ్‌బోలే, స్మిత తాంబే, సుహిత తట్టే, ఆశా శేలర్, ప్రియా బెర్దే, ఈషా దే, రసిక ఆఘాసే, అమృత నామ్‌దేవ్, ఆదిత్య మిశ్రా, జహిద్ ఖాన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అమన్ పంత్, కృష్ణ సోలో సంగీతం అందించగా.. దేవ్ రావ్ జాదవ్ ఎడిటర్‌గా, అయాన్ సిల్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. జూన్ 12న భారత భాగ్య విధాత మూవీ విడుదల కానుంది.

గవర్నర్:
1990లో భారత ఆర్ధిక వ్యవస్థను కుదిపేసిన సంక్షోభం బ్యాక్‌డ్రాప్‌లో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మూవీ గవర్నర్. విలక్షణ నటుడు మనోజ్ భాజ్‌పాయ్ ఈ మూవీలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా నటించారు. సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై విపుల్ అమృత్‌లాల్ షా ఈ సినిమాను నిర్మించగా.. చిన్మయ్ డి మండ్లేకర్ దర్శకత్వం వహించారు. ఆదా శర్మ, నౌషద్ మొహమ్మద్ కుంజు, మధు శర్మ, పరితోష్ సంద్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. గవర్నర్ చిత్రానికి అమృత్ త్రివేది సంగీతం, మన్నన్ షా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. విశాల్ సిన్హా సినిమాటోగ్రాఫర్‌గా.. మేఘన మన్‌చందా సేన్, సంజయ్ శర్మలు ఎడిటర్‌గా వ్యవహరించారు. జూన్ 12న గవర్నర్ మూవీ విడుదల కానుంది.

చారుకేశి
మ్యూజిక్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో సురేష్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం చారుకేశి. వైజీ, మహేంద్ర, సత్యరాజ్, సుహాసినీ మణిరత్నం, సుమద్రఖని, రమ్య పాండియన్, తలైవాసల్ విజయ్, రాజ్ అయ్యప్ప, మధువంతి, ధీన, రిత్విక్, ప్రతీక‌ తదితరులు నటించారు. దేవ సంగీతం అందించగా.. రిచర్డ్ ఎడిటర్‌గా.. అశోక్ రాజ్, స్వర్ణ, కళ తదితరులు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. జూన్ 12న చారుకేశి మూవీ తమిళంలో విడుదల కానుంది.

పైన పేర్కొన్నవి కాకుండా.. జూన్ 11న కన్నడంలో గ్రామాయణ, జూన్ 12న మృత్యుదేవత సినిమాలు రిలీజ్ కానున్నాయి. జూన్ 12న తెలుగులో డేంజర్ డెవిల్.. తమిళంలో డబుల్ ఆక్యూపెన్సీ, హబీబీ, వల్లువన్ విడుదల కానున్నాయి. అలాగే హిందీలో హంటెడ్ 3డీ ఎచోస్ ఆఫ్ ది పాస్ట్, మై వాపస్ అవుంగా, ది నర్మదా స్టోరీలు రిలీజ్ కానున్నాయి. అలాగే మలయాళంలో వరవు.. ఇంగ్లీష్‌లో బ్యాక్‌రూమ్స్, డిస్‌క్లోజర్ డే, స్కారీ మూవీ సినిమాలు విడుదల కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X