Guppedantha Manasu May 18th: వసు పెళ్లిలో రచ్చ.. మహేంద్ర ఎంట్రీతో రాజీవ్ ఖతం.. బయటకొచ్చిన మను!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వసును కిడ్నాప్ చేసిన రాజీవ్ ఆమెను పెళ్లి చేసుకోబోయే ప్రయత్నం చేస్తాడు. అక్కడే ఉన్న శైలేంద్ర దాన్ని ఆపాలనుకుంటాడు. కానీ రాజీవ్ కుదరనివ్వడు. ముఖ్యంగా తన చేతిలోనే గన్ ను శైలేంద్రకు ఇచ్చి మరీ ఆగుతాడు. అయితే రాజీవ్ ను కాల్చి వసును కాపాడితేనే తనకు ఎండీ పదవి దక్కుతుందని భావించిన శైలేంద్ర ఆలోచనలు.. రాజీవ్ చెక్ పెడతాడు. కాల్చాలనుకుంటున్నావేమో.. అందులో బుల్లెట్లు లేవని చెబుతాడు. ఇక ఏం చేయలేక శైలేంద్ర చూస్తూ ఉంటాడు. అప్పుడే రాజీవ్ వసు మెడలో తాళి కట్టాలనుకుంటాడు. కానీ అప్పటికే రిషి కట్టిన తాళి ఆమె మెడలో ఉండడం చూస్తాడు.
దీంతో దాన్ని తెంచి తను తాళి కట్టాలని అనుకుంటాడు. వసు మెడలోనే తాళి తెంపే ప్రయత్నం చేస్తాడు. వసు వద్దు బావా వద్దు అంటూ కాళ్లా వేళ్లా పడుతూ బతిమాలుతుంది. అతడిని దూరంగా తోస్తుంటుంది. శైలేంద్ర కూడా వద్దు బ్రదర్ ఇది చాలా పాపం అంటూ చెప్పుకొస్తాడు. అప్పుడే రాజీవ్ నువ్వు, నేనే మాట్లాడుకోవాలి పాప పుణ్యాల గురించి అంటూ కామెంట్లు చేస్తాడు. అలా అంటూనే వసును మెడలో తాళి తెంపాలని చూస్తుంటాడు. అప్పుడే మహేంద్ర ఎంట్రీ ఇస్తాడు. రాజీవ్ తలపై గట్టిగా కొట్టడంతో అతడు కింద పడిపోతాడు. వసుధార దగ్గర ఉన్న జీపీఎస్ ట్రాకర్ సాయంతో మహేంద్ర ఆమెను కాపాడుతాడు. ముఖ్యంగా రాజీవ్... వసును పెళ్లి చేసుకోకుండా ఆపుతాడు. కిందపడ్డ రాజీవ్ లేచిన వెంటనే గన్ తీసి మహేంద్రకు గురిపెడతాడు.

అయితే ఆ గన్ లో బుల్లెట్లు లేవన్న విషయాన్ని శైలేంద్ర.. తన బాబాయి మహేంద్రకు సైగ చేసి చెబుతాడు. కానీ అదంతా గమనించిన రాజీవ్ అప్పుడు లేవు కానీ ఇప్పుడు ఉన్నాయని చెప్పుకొస్తాడు. కానీ శైలేంద్ర మాత్రం అదంతా జోక్ అంటూ చెప్పుకొస్తాడు. దీంతో రాజీవ్ కు కోపం పెరిగి.. మహేంద్ర మీద నుంచి శైలేంద్రను టార్గెట్ చేస్తాడు. వెంటనే కాలుస్తాడు కూడా. కానీ శైలేంద్ర సడెన్ గా పక్కకు తప్పుకోవడంతో బుల్లెట్ మిస్ అవుతుంది. జోక్స్ చేస్తున్నానని నన్ను కామెడీ విలన్ అనుకుంటున్నావేమో అలాంటి తప్పు చేయొద్దంటూ సూచిస్తాడు. నేను నీకంటే చాలా పెద్ద విలన్ ను అంటూ శైలేంద్రకు వివరిస్తాడు. అయితే రాజీవ్ మాటలకు బదులు ఇస్తూనే.. కావాలని గొడవ పెద్దది రాజీవ్ చేతిలోంచి గన్ కొట్టేస్తాడు శైలేంద్ర.
Shyamala Devi: ప్రభాస్ చెప్పిన ఆ స్పెషల్ పర్సన్ కాబోయే భార్యేనా.. క్లారిటీ ఇచ్చిన శ్యామలాదేవి!\
వెంటనే ఆ గన్ తో రాజీవ్ ను బెదిరిస్తాడు. అప్పుడే మా బాబాయ్ మనకంటే పెద్ద విలన్ లా ఉన్నాడని అనగా.. నేను విలన్ కాదు హీరోను అంటూ మహేంద్ర బదులిస్తాడు. తాను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే, ఇక్కడే చంపొచ్చు.. కానీ నేను అలా చేయను అంటూ రాజీవ్ తో అంటాడు మహేంద్ర. అప్పుడే పోలీసులు ఎంట్రీ ఇస్తారు. రాజీవ్ ను అరెస్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్ తీసుకు వెళ్లబోతుంటారు. అప్పుడే రాజీవ్.. నేను నిన్ను వదిలిపెట్టను, జైలు నుంచి తప్పించుకుని వచ్చి అయినా సరే నీ మెడలో తాళి కడతాను అంటూ వసుకు వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత దేవయాని కుటుంబాన్ని చూపిస్తారు. ఇంటికెళ్లి శైలేంద్ర రాజీవ్ బతికే ఉన్నాడని చెబుతాడు. అది విన్న దేవయాని సంతోష పడగా.. ధరణి అతడు బతికితే మీకెందుకు అంత ఆనందం అంటూ అడుగుతుంది. ఏం చెప్పాలో తెలీక తల్లిని కాపాడేందుకు.. రాజీవ్ బతికుంటే మను సేవ్ అయినట్లే కదా అంటూ ధరణితో చెబుతాడు శైలేంద్ర.

ఇక ఆ తర్వాత రేపు కాలేజీలో తనకు మంచి జరుగుతుందని.. ఆ వేడుకకు దేవయాని, ధరణిలు ఇద్దరూ రావాలని అంటాడు శైలేంద్ర. కానీ ధరణి మాత్రం నేను వస్తే మీకు మంచి జరగట్లేదు నేను రానని చెబుతుంది. దేవయాని మాత్రం మను బయటకు వస్తే శైలేంద్రకు మంచి ఎలా జరుగుతుందని ఆలోచిస్తుంటుంది. వెంటనే కొంపదీసి రాజీవ్ ను నువ్వే పట్టించలేదు కదా అంటూ కొడుకును అడుగుతుుంది. తాను కాదని చెబుతాడు శైలేంద్ర. దీంతో దేవయాని కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. రాజీవ్ ను పోలీసులకు పట్టించిన వాడిని వదిలిపెట్టడని.. కట్టుకున్న దాన్ని చంపిన వాడు.. మోసం చేసిన వారిని అంతం చేయడం పెద్ద లెక్క కాదని వివరిస్తుంది. దేవయాని మాటలతో శైలేంద్ర చాలా భయపడిపోతాడు.
ఇక ఆ తర్వాత మను, వసు, మహేంద్రలు.. అనుపమ వద్దకు వెళ్తారు. కొడుకును చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది అనుపమ. కానీ మాట్లాడదు. అంతలోనే వసు, మహేంద్రలు.. కొడుకు కోసం ఇన్నాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నావు.. ఇప్పుడు మాట్లడవేంటని అంటారు. కానీ ఆమె సమాధానం చెప్పకపోయేసరికి.. మనుయే అనపమ మాట్లాడకపోయినా ఆమె మాటలు తనకు వినిపిస్తాయని అంటాడు. ఆమె ప్రేమ, కోపం, బాధ, ఆనందం.. ఇలా అన్ని తనకు తెలుసని.. కానీ ఒక్క ప్రశ్నకే సమాధానం దొరకదని అంటాడు. ఇలా ఈరోజుటి సీరియల్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











