X
Home టాప్ లిస్టింగ్

మహేష్ బాబు పై ఫ్యాన్స్ అసంతృప్తి.. కార‌ణాలు..!

Author Administrator | Updated: Saturday, June 24, 2023, 11:11 AM [IST]

టాలీవుడ్‌లో నాలుగున్న‌ర ప‌దుల వ‌య‌సు దాటినా ఇంకా పాతికేళ్ల కుర్రాడిలాగానే క‌న‌ప‌డే హీరో అంటే ఠ‌క్కున వినిపించే స‌మాధానం సూప‌ర్ స్టార్ మ‌హేష్‌. ఇప్ప‌టికే 27 సినిమాల‌ను పూర్తి చేసుకుని 28వ సినిమా చేస్తోన్న ఆయ‌న కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్స్ చాలానే ఉన్నాయి. అయితే ఆయ‌న క్రేజీ డైరెక్ట‌ర్స్‌ను పక్క‌న పెట్టేశారు. ఆ లిస్టులో ఇంకా పెద్ద‌గానే ఆ సినిమాలు చేసుంటే ఇమేజ్ ఇంకా పెరిగుండేది. ఇంత‌కీ మ‌హేష్ ప‌క్క‌న పెట్టేసిన సినిమాల లిస్లు.. ఫ్యాన్స్‌కి ఆయ‌న‌పై ఉన్న అసంతృప్తికి కార‌ణాలేంటో చూద్దాం


cover image

ప్ర‌స్తుతం మ‌హేష్ చేస్తోన్న చిత్రం గుంటూరు కారం. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడు. ఇందులో మ‌హేష్ ప‌క్కా మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. రీసెంట్‌గా వ‌చ్చిన గ్లింప్స్ ఈ విష‌యాన్ని క‌న్‌ఫ‌ర్మ్ చేసింది. దీంతో సినిమా కోసం ఫ్యాన్ష్ వెయిటింగ్ అయితే మ‌హేష్ మాత్రం వెకేష‌న్స్ అంటూ తిరుగుతున్నాడే కానీ.. సినిమా మాత్రం చేయ‌టం లేదు. మ‌రో వైపు సినిమాలో మేజ‌ర్ మార్పులు చేర్పులు చేస్తున్నారు. త‌మ‌న్‌ను మార్చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చినా అందులో నిజం లేద‌ని తేలింది. అయితే ఇప్పుడు పూజా హెగ్డేను మార్చేశార‌ని టాక్ వ‌స్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రానుంది. 

డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేసే దర్శకుడు సుకుమార్ ఇప్పుడు పుష్ప 2 మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. పుష్ప దిరైజ్ సినిమాకు ఇది కొనసాగింపు. పార్ట్ వన్ లాక్ డౌన్ టైమ్‌లోనే పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బాస్ట‌రైంది. మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించింది. అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అయ్యారు. ఇప్పుడు పుష్ప 2పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. నిజానికి ఈ సినిమా క‌థ‌ను సుకుమార్ ముందుగా మ‌హేష్‌కే చెప్పారు. కానీ అందులో ర‌గ్డ్ లుక్‌తో క‌నిపించాల‌నే కార‌ణంతో ఆ స‌బ్జెక్ట్‌ను మ‌హేష్ ప‌క్కన పెట్టేశారు. 

డిఫ‌రెంట్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసే అతి కొద్ది మంది ద‌ర్శ‌కుల్లో వెట్రిమార‌న్ ఒక‌రు. ఆయ‌న కూడా మ‌హేష్ కోసం ఓ విల‌క్ష‌ణ‌మైన క‌థ‌ను సిద్ధం చేసుకుని వ‌చ్చి వినిపించారు. ఆయ‌న‌కు న‌చ్చ‌లేదు. చివ‌ర‌కు ఆ ప్రాజెక్ట్‌ను కూడా ప‌క్క‌న పెట్టేశారు. 

మ‌హేష్ బాబుని పోకిరి త‌ర్వాత బిజినెస్ మేన్ సినిమాలో ప‌క్కా మాస్ యాంగిల్‌లో చూపించారు ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌. ఆ సినిమాలో మ‌హేష్ బాడీ లాంగ్వేజ్‌కి సెప‌రేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ త‌ర్వాత అలాంటి మాస్ మూవీ రాలేదు. మ‌హేష్‌కి మంచి మార్కెట్‌, ఫ్యాన్ బేస్ ఉన్న‌ప్ప‌టికీ మాస్ ఇమేజ్ మాత్రం రాలేదు. ఆ పంథాలో మ‌హేష్ సినిమాలు ఎంచుకోలేద‌ని ఫ్యాన్స్ బాధ‌ప‌డుతుంటారు. 

మ‌హేష్‌ను సూప‌ర్‌స్టార్‌గా నిల‌బెట్టిన పోకిరి సినిమా, ఆ ఇమేజ్‌ను మ‌రింత‌గా పెంచిన బిజినెస్ మేన్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ వీరి కాంబోలో సినిమా మాత్రం రాలేదు. మ‌హేష్ కోసం జ‌న‌గ‌ణ‌మ‌న అనే సినిమాను ప్లాన్ చేసిన‌ప్ప‌టికీ అది వ‌ర్క‌వుట్ కాలేదు. అలా పూరికి మ‌హేష్ షాకిచ్చాడు. 

కె.జి.య‌ఫ్ చిత్రాల‌తో బాక్పాఫీస్‌ను షేక్ చేసిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌.. ప్ర‌భాస్‌తో స‌లార్ సినిమాను చేస్తున్నారు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌తో మూవీ చేస్తున్నారు ప్ర‌శాంత్ నీల్‌. అయితే నిజానికి ఆ సినిమాను మ‌హేష్‌తో చేయాల్సింది. కానీ.. మ‌హేష్ మాత్రం రాజ‌మౌళి సినిమాకే ఓటు వేశాడు. కానీ నీల్ సినిమాను ప‌క్క‌న పెట్టేశాడు మ‌హేష్.

ఇలా ఎన్నో క్రేజీ ప్రాజెక్టుల‌ను, ద‌ర్శ‌కుల‌ను మ‌హేష్ ప‌క్క‌న పెట్టేశారు మ‌హేష్. అవ‌న్నీ చేసుండుంటే ఆయ‌న మాస్ ఇమేజ్ మ‌రో రేంజ్‌లో ఉండేద‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అర్జున్ రెడ్డితో టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన ద‌ర్శ‌కుడు సందీప్ వంగా. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ సినిమా చేద్దామ‌ని మంచి క‌థ‌తో ర‌మ్మ‌ని అన్నారు. సందీప్ కూడా మ‌హేష్ కోసం ఓ డిఫ‌రెంట్ క‌థ‌ను రెడీ చేసుకుని వెళ్లాడు. ముందు క‌థ న‌చ్చ‌లేద‌న్నారు. స‌రేన‌ని మ‌రో రెండు క‌థ‌లు వినిపించినా..మ‌హేష్‌కి న‌చ్చ‌లేదు. మ‌హేష్‌కి చెప్పిన క‌థ‌ల్లో నుంచి ఓ క‌థ‌తో ఏకంగా బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌ణ్‌భీర్‌తో యానిమ‌ల్ సినిమా చేస్తుండ‌టం విశేషం. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+