X
Home టాప్ లిస్టింగ్

టాలీవుడ్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్న యంగ్‌ హీరోలు ఎవరంటే..!

Author Administrator | Updated: Sunday, July 9, 2023, 07:46 AM [IST]

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో యంగ్‌ హీరోలు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో సినీ ప్రేక్షకుల తమవైపుకు తిప్పుకుంటున్నారు.తెలుగు టాప్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే.. మేము కూడా తక్కువేం కాదు అంటూ తమ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందుతున్నారు. ప్రస్తుతం తెలుగు లో రూల్ చేస్తున్న యంగ్‌ హీరోల లిస్ట్ మీ కోసం.


cover image
విజయ్ దేవరకొండ
1

టాలీవుడ్ ఇండస్ట్రీ లో దూసుకెళ్తున్న యంగ్‌ హీరోల లిస్ట్ లో విజయ్ దేవరకొండ మొదటి ప్లేస్ ఉంటాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో సెన్సేషనల్ టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ గా పేరు తెచ్చుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నతనకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి అనే ఒక సినిమా శివ నిర్మాణ దర్శకత్వం లో చేస్తున్నాడు. 

అడివి శేష్‌
2

టాలీవుడ్ లో యువ హీరోలలో  డిఫెరెంట్ కథలను ఎంచుకుంటూ తనదైన నటనతో తెలుగు సినిమాల్లో కొత్తదనం కోరుకొనే సినీ ప్రేక్షకులకు నేను వున్నాను అంటూ బరోసా ఇస్తున్నాడు అడివి శేష్.  వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు టాలీవుడ్ యువ హీరో అడివి శేష్.  మేజర్ సినిమాతో పాన్ఇండియా స్థాయిలో అద్భుత విజయాన్ని అందుకున్నాడు.  తాజాగా హిట్ ది సెకండ్ కేస్ రూపంలో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తన టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ తో ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. అడివి శేష్ ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే ఆ కథ డిఫెరెంట్ గా ఉంటుంది అనే  అంచనాలకు తీసుకెళ్లాడు. 

నిఖిల్ సిద్దార్థ్
3

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్. కెరీర్ తొలినాళ్లలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. మధ్యలో కొన్ని ఫ్లోప్స్ కొంచెం స్లో అయ్యాడు. కార్తికేయ 2 బ్లాక్ బాస్టర్ హిట్ తో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు

నాగ శౌర్య
5

చిన్న హీరోగా ప్రయాణం ప్రారంభించి మంచి లవ్ స్టోరీస్ లో నటించి చాక్లెట్ బాయ్ ఇమేజ్ సంపాధించిన హీరో నాగ శౌర్య. ప్రస్తుతం   ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి తో మనముందుకు వస్తున్నాడు. ఈ సినిమా మార్చి 17న రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత లక్ష్య, పోలీస్ వారి హెచ్చరిక, నారీనారీనడుమ మురారీ అనే సినిమాల తో వస్తున్నాడు 

సందీప్ కిషన్
6

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న సందీప్ కిషన్ ఆ తరువాత చేసిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి. లోకేష్ కనక రాజు డైరెక్షన్ లో వచ్చిన నగరం సినిమాతో తన నటనకు గుర్తింపు వచ్చింది. సందీప్ కిషన్  నటించిన తొలి పాన్ ఇండియా సినిమా అంచనాలు పెట్టుకున్న మైకేల్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి బాక్స్ ఆఫీసు వద్ద ప్లాప్ అయ్యింది. ప్రస్తుతం దేవాకట్టా తో సినిమా చేసి హిట్ ట్రాక్ ఎక్కలని చేస్తున్నాడు వీళ్ళ కాంబో లో ఇప్పటికే ప్రస్థానం సినిమా వచ్చి మంచి విజయం సాధించింది.

వరుణ్ తేజ్
7

కంచె, ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం  ఇలా అన్నీ ఫ్రెష్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్  కథలను ఎన్నుకుంటూ వరుణ్ తేజ్ కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఎఫ్2,  ఎఫ్3 సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.  గని’సినిమాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు.  ప్రస్తుతం  ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమాను చేస్తున్నాడు. 

సాయి ధరమ్ తేజ్
8

సాయిధరమ్‌ తేజ్ ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తుంటాడు. 'పిల్లా నువ్వులేని జీవితం' హిట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్‌. 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌', 'సుప్రీమ్‌', చిత్రలహరి వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం  కార్తిక్‌ దండు దర్శకత్వంలో విరూపాక్ష మిస్టరీ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం ఇదే కావడంతో సినిమాపై అంచనాలు నెలకొననాయి. జయంత్‌ పనుగంటి దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్ తన 16వ సినిమా చేస్తున్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఫాంట‌సీ డ్రామా సినిమా ఇటీవ‌లే ప్రారంభ‌మైంది.   

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+