X
Home టాప్ లిస్టింగ్

జనాల్లో ఆలోచనలు రేకెత్తించేలా.. న్యూసెన్స్ వెబ్ సిరీస్!

Author Administrator | Published: Thursday, May 18, 2023, 12:18 PM [IST]

జర్నలిజం నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ 'న్యూసెన్స్'. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సరికొత్త వెబ్ ఒరిజినల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఓ తుపానులా ప్రభంజ‌నం సృష్టిస్తోంది. గ్రిప్పింగ్ నెరేష‌న్‌, ఆలోచ‌న‌న‌ను రేకెత్తించే క‌థాంశంతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటోంది.


cover image
1

నవదీప్, బిందు మాధవి, మహిమా శ్రీనివాస్, నంద గోపాల్, కట్టా ఆంటోనీ, కుమారి, షెల్లీ నబు కుమార్, చరణ్ కురుగొండ, రమేష్ కోనంభొట్ల, శ్వేతా చౌదరి, పూర్ణ చంద్ర,  నల్ల శ్రీధర్ రెడ్డి, గణేష్ తిప్పరాజు, వెంకట రమణ అయ్యగారి, తదితరులు

2

కథ : ప్రియదర్శిని రామ్
మాటలు : జయసింహ నీలం
స్క్రీన్ ప్లే : ప్రియదర్శిని రామ్, జయసింహ నీలం, శ్రీ ప్రవీణ్ కుమార్
పాటలు : పుట్టా పెంచల్ దాస్
ఛాయాగ్రహణం : వేదరామన్ శంకరన్, అనంత్ నాగ్ కావూరి, ప్రసన్న కుమార్
సంగీతం : సురేష్ బొబ్బిలి
సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల
నిర్మాత : టీజీ విశ్వప్రసాద్
క్రియేటర్ & డైరెక్టర్ : శ్రీ ప్రవీణ్ కుమార్

3

ఆహా లో పలు సిరీస్ లు అలానే సినిమాలు ఆడియన్స్ ని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నాయి. ఇక తాజాగా నవదీప్,   బిందు మాధవి కీలక పాత్రలలో నటించిన  న్యూసెన్స్ వెబ్ సిరీస్ మే 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది

4

న్యూసెన్స్ వెబ్ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రతి ఎపిసోడ్ లో కూడా ఆసక్తిరేకెత్తించే సన్నివేశాలతో కట్టిపడేశారు. 1990- 2000 దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి ప్రెస్ క్లబ్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఉదయాన్నే పేపర్ చూసి.. సాయంకాలం వేళ టీవీలో వార్తలు చూసేదే నిజం అనుకునే జనాల అమాయకత్వపు ఆలోచనలను స్టోరీగా మలిచి ఈ సినిమా రూపొందించారు.

5

1990-2000 ద‌శకంలో ఏపీలోని మ‌ద‌న‌ప‌ల్లిలోని స్ట్రింగ‌ర్స్‌ను ప్రపంచానికి ప‌రిచ‌యం చేసింది. మ‌న స‌మాజంలో మీడియాకున్న ప్రాధాన్యత‌ల‌పై ప్రశ్నల‌ను లేవ‌నెత్తిందీ సిరీస్‌. వార్తల‌ను తెలియ‌జేయ‌టం, సంచ‌ల‌నాత్మక వార్తల ప్రభావం వంటి అంశాల‌ను ఈ సిరీస్‌లో చూపించారు. ముక్యంగా అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య జర్నలిస్టులు ఎలా నలిగిపోతున్నారు..  ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక ఇద్దరు దగ్గర డబ్బులు తీసుకుని సమన్యాయం చేసే తెలివితేటలు అలాగే సామాన్యులు న్యాయం కోసం పోరాడుతుంటే వారి తరఫున పోరాడలేక రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తీసుకుని సైలెంట్గా ఉండిపోతున్న వ్యవహారాలు చర్చిస్తూ  ఆసక్తికరమైన కథాంశంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. 

6

నవదీప్ సరైన క్యారెక్టర్ పడితే ఎంత అద్భుతంగా చేస్తాడనేది చెప్పడానికి  న్యూసెన్స్  మంచి ఉదాహరణ,  బిందు మాధవి స్క్రీన్ టైమ్ తక్కువ. కానీ, పాత్రకు పర్ఫెక్ట్ యాప్ట్. నవదీప్, బిందు మాధవి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది.  వీళ్లిద్దరికీ తోడు మహిమా శ్రీనివాస్ కూడా తోడు కావడంతో సీజన్ 2లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ చూడొచ్చు,  ఎడ్విన్ పాత్రలో ప్రేక్షకులకు గుర్తుండేలా నంద గోపాల్ నటించారు. అయ్యప్ప పాత్రలో కట్టా ఆంటోనీ కూడా. మిగతా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.

 

7

ఈ సిరీస్ లో కొన్ని కీలక సన్నివేశాలు జర్నలిజం మీడియాలోని కొన్ని చీకటి కోణాల్ని బాగా చూపిస్తుంది. ఇక మరికొన్ని సీన్స్ అయితే ఆడియన్స్ ని షాక్ కి గురి చేస్తాయి. ఏ విధంగా కొందరు రాజకీయ నాయకులు జర్నలిస్టులని మీడియాని తమ స్వార్ధం కోసం వాడుకుంటున్నారు.  ఓ మహిళ భర్తను పొలిటీషియనే హత్య చేయిస్తాడు. కానీ ఆమె అక్రమ సంబంధం వల్లే అతడు చనిపోయాడంటూ వార్త రాస్తారు. జర్నలిస్టులు ఇంత రాక్షసంగా ఉంటారా జనాల్లో ఆలోచనలు రేకెత్తించేలా ఈ వెబ్ సిరీస్ 

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+