అన్‌స్టాపబుల్ టాక్ షో మన దేశంలో ప్రసారమయ్యే టాక్ షోలలోనే మొదటి స్థానంలో నిలిచింది. టాక్ షోలో రెండో స్థానంలో కపిల్ శర్మ చేస్తోన్న ‘ది కపిల్ శర్మ’ షో నిలిచింది. ఇక ఐశ్వర్య రాయ్ అమెజాన్ ఫ్యాషన్ షో 4.9 పాయింట్లతో పదో ప్లేస్‌లో నిలిచింది. అన్ని టీవీ సిరీస్‌లో 50 టాప్ షోలను సెలెక్ట్ చేస్తే.. అందులో బాలకృష్ణ చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ అగ్ర స్థానంలో నిలివడం విశేషం. బాలకృష్ణ తన యాటిట్యూడ్ కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్ తో చేస్తున్నఈ టాక్ షో, చాలా పెద్ద సూపర్ హిట్ కాదు.. కాదు.. బ్లాక్ బస్లర్ అయింది.ఐఎండీబీ సంస్థ సినిమాలతో పాటు టీవీ సిరీస్‌లు, వెబ్ సిరీస్‌లతో పాటు టీవీల్లో ప్రసారమయ్యే టాక్ షోలకు రేటింగ్ ఇస్తూ ఉంటోంది.ఈ లెక్కన తక్కువ టైమ్‌లో ఎక్కువ మందిని ఆకట్టుకున్న లెక్కల ద్వారా గ్రేడింగ్ ఇస్తోంది.ఇందులో బాలయ్య చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ తొలి స్థానంలో నిలిచింది