X
Home టాప్ లిస్టింగ్

లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేసిన టాప్‌ హీరోయిన్స్

Author Administrator | Published: Wednesday, May 3, 2023, 04:40 PM [IST]

సౌత్ సినీ ఇండ్రస్ట్రీ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. యువ హీరోయిన్లతో పాటు స్టార్ హీరోయిన్స్ సైతం లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కంటెంట్‌ బాగుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు ఉండడం లేదు. అదే విధంగా స్టార్ హీరో సినిమా అయినా సరే కథ బాగాలేదంటే థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేసిన టాప్‌5 హీరోయిన్స్ ఇప్పుడు చూద్దాం


cover image
అనుష్క శెట్టి
1

టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పునాది వేసింది అనుష్కనే. ఈ ముద్దుగుమ్మ నటించిన అరుంధతి సినిమా అప్పట్లో ఎంత పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జేజమ్మ పాత్రలో అనుష్క నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. హారర్‌‌, థ్రిల్లర్‌‌గా తెరకెక్కిన అరుంధతి సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌ సినిమాలకు మార్కెట్‌ లేదని అనుకున్న వాళ్లందరికీ ఈ సినిమా కలెక్షన్లు ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమా తర్వాత అనుష్క ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

సమంత రుతు ప్రభు
2

సౌత్ లో దాదాపు అందరూ స్టార్ హీరోలతో కలిసి నటించిన సమంత ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది . ఇక, ఓ బేబి, యూటర్న్ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అలరించారు సామ్. కొంత గ్యాప్ తర్వాత యశోదతో మన ముందుకు వచ్చారు. ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై మంచి కలెక్షన్లు వసూలు చేసింది.  గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం మాత్రం నిరాశపరిచింది ఎన్నో అంచనాల నడుమ ఇటీవల రిలీజైన ఈ మూవీ ఆడియన్స్‌ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

నయనతార
3

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిందిసౌత్ లో ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన ఘనత కూడా ఈ హీరోయిన్దే  కావడం విశేషం. ఇక ఈమె తమిళంలో నటించిన కో కో కోకిల, వసంతకాలం, అమ్మోరు తల్లి, లేడీ టైగర్, ఓ2, మయూరి, డోర  వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

కీర్తి సురేష్
4

నేను శైలజ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు కీర్తి సురేష్. ఈ సినిమా తర్వాత నేను లోకల్, అజ్ఞాతవాసి సినిమాలు చేశారు. అలనాటి హీరోయిన్‌ సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో టైటిల్‌ రోల్‌ చేసి మెప్పించారు కీర్తి సురేష్ . ఈ సినిమాలో నటనకుగాను నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈ సినిమా తర్వాత మిస్‌ ఇండియా, పెంగ్విన్, గుడ్‌లక్‌ సఖి, చిన్ని వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించారు కీర్తి.  

ఐశ్వర్యా రాజేష్‌
5

ఐశ్వర్యా రాజేష్‌ భారతీయ సినీ నటి  1990 మార్చి 10న జన్మించింది. నటుడు రాజేష్‌ కుమార్తె, హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలు. ఐశ్వరా రాజేష్‌ తమిళ్‌, మలయాళ, తెలుగు సినిమాలలో నటిస్తున్నది.  తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్ అనే సినిమాలో మహిళా క్రికెటర్‌గా ప్రధాన పాత్రలో టాలీవుడ్‌లోకి ప్రవేశిస్తోంది.  ...

సాయి పల్లవి
6

గ్లామర్‌‌షోకు దూరంగా ఉంటూనే తన నటన, అభినయంతో అభిమానులను సంపాదించుకున్నారు సాయి పల్లవి. నటనతోపాటు మంచి గ్రేస్‌తో డాన్స్ చేయడం సాయిపల్లవి స్పెషాలిటీ. నేచురల్‌ స్మైల్‌తో ప్రేక్షకులను మెప్పించడంతోపాటు, ఎమోషన్ సీన్స్‌తో కంటతడి కూడా పెట్టించగలనని నిరూపించుకున్నారు. గార్గి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయగలనని చెప్పారు సాయిపల్లవి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+