‘రొమాంటిక్’ అప్‌డేట్.. విడుదల ఎప్పుడంటే..?
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాద్ ఇండస్ట్రీలో ఎంతో మందికి హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు. తాజాగా ఇస్మార్ట్ శంకర్‌తో రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అయితే పూరీ మాత్రం తన కొడుకు ఆకాష్‌కు ఓ హిట్ ఇవ్వలేకపోతున్నాడు. ఓ హీరోలా నిలబెట్టలేకపోతున్నాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మెహబూబా బోల్తా కొట్టింది. అయితే ఆకాష్ ఆశలన్నీ ప్రస్తుతం రొమాంటిక్ మీదే పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న రొమాంటిక్ చిత్రాన్ని పూరి జగన్నద్ శిష్యుడైన అనిల్ పాడూరి తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్‌తో ఎంతో వేడి పుట్టించింది చిత్రయూనిట్. పాటలతోనే ఓ రేంజ్ రొమాంటిక్ టచ్ ఇచ్చిన యూనిట్.. పూర్తి సినిమాతో ఇంకెంత సన్సేషన్ క్రియేట్ చేస్తారోనని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ ఎప్పుడు విడుదలవుతుందోనని రేపు ప్రకటిస్తామని యూనిట్ తెలిపింది. రొమాంటిక్ రిలీజ్ డేట్‌ను రేపు(ఫిబ్రవరి 10) 01:56 గంటలకు ప్రకటిస్తామని ట్వీట్ చేశారు. పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











