"రమాప్రభకి ఆయనంటే పిచ్చి.. వీధుల్లో తిరుగుతూ అలా చేసేది"

అలనాటి సీనియర్ హాస్య నటి శ్రీలక్ష్మీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించిన ఈమె.. మధ్య సినిమాలు చేయట్లేదు. కానీ వందలాది చిత్రాలు చేసిన ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తనకు ఎన్ని ఆస్తులు ఉన్నా తాను దైవచింతనతో బతుకుతున్నానని చెప్పుకొచ్చింది. అలాగే నటి రమాప్రభ గురించి సెన్సేషనల్ కామెంట్లు చేసింది. ఆమెకు ఆ విషయంలో పిచ్చి ఉందని... వీధుల్లో తిరుగుతూ అలా చేసేందంటూ తెలిపింది. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

Hero Vishal: గుడ్‌న్యూస్ చెప్పిన హీరో విశాల్.. పాతికేళ్ల కళ అలా తీరబోతుందట!
నటి శ్రీలక్ష్మికి రమాప్రభా చాలా బాగా తెలుసు. వీరిద్దరూ చాలా సినిమాలు కలిసి చేశారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్యా మంచి స్నేహం కూడా ఉంది. అయితే వీరిద్దరూ సినిమాలు చేసే సమయంలోనే రమా ప్రభాను తాను చాలా దగ్గర నుంచి చూశానని.. ఆమెలోని చాలా విషయాలు తనకు ఆసక్తి కల్గించాయని పేర్కొంది. ముఖ్యంగా ఆమెకు ఒకరిపై ఉన్న అమితమైన ప్రేమను చూసి తనకు చాలా భయం కల్గిందని కూడా వెల్లడించింది.

Actress Sri lakshmi Sensational Comments About Senior actress Ramaprabha Check Details

సీనియర్ నటి రమాప్రభ భర్త శరత్ బాబుతో విడిపోయాక... చాలా డిప్రెషన్ కు లోనైంది. కానీ వాటన్నిటి నుంచి తేలుకుని.. కేవలం దైవచింతనతోనే బతుకుతుంది. అయితే ఈమెకు సాయి బాబా అంటే ముందు నుంచి చాలా ఇష్టం అని.. ఈమె సినిమాల్లో ఓ స్థాయికి వచ్చిన తర్వాత కూడా సాయిబాబానే తన సర్వస్వం అనుకున్నట్లు నటి శ్రీలక్ష్మీ వెల్లడించారు. అయితే సినిమా షూటింగ్ తో పాటు, ఆడియో, ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్లు అయినప్పుడు ఆమె ఎక్కడ పడితే అక్కడ సాయిబాబా పాటలు పాడుతూ డ్యాన్సులు చేసేదని వెల్లడించింది.

పక్కన ఎవరు ఉన్నా పట్టించుకోకుండా.. నిత్యం సాయి నామ స్మరణలో మునిగిపోయి మరీ భక్తిపారవశ్యంలో మునిగిపోయేదని నటి శ్రీలక్ష్మీ వివరించారు. ఎన్నో వందల కోట్ల ఆస్తులు ఉన్న ఆమెకు.. ఆస్తులు, ప్రేమ, ఆభరణాలు.. ఇలా వాటిపై ఆసక్తి లేకుండా.. కేవలం ఆ దేవుడిపైనే ఇంత ప్రేమ ఉండడం చూసి తాను చాలా షాక్ అయినట్లు కూడా వివరించింది. అలాగే తనకు కూడా రాఘవేంద్ర స్వామిపై చాలా ప్రేమ ఉండేదని.. నటి శ్రీలక్ష్మీ పేర్కొంది. కాను ఆ స్వామిని ఆరాధించే వాళ్లు చాలా మడి ఆచారాలు పాటించాలని తెలిపింది.

కానీ తాను సినిమాలు చేయడం వల్ల అన్ని మడి ఆచారాలు పాటించకపోవడం వల్ల ఆ స్వామిని పూజించలేకపోయానని తెలిపింది. కానీ రమాప్రభాను చూశాకా.. ఆమెకు సాయిబాబా మీద ఉన్న ఇష్టం చూసి తాను కూడా బాబా భక్తురాలిగా మారానని చెప్పింది. అయితే దేవుడు అంతా ఒకటేనని రూపాలు మాత్రమే వేరని వివరించింది. తనకు కూడా రమాప్రభలాగా అంత పిచ్చి భక్తితో ఉండాలని ఉంటుందని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X