Romantic Trailer: రొమాన్స్ తో షాక్ ఇచ్చిన ఆకాష్ పూరి.. లవ్ లేదు.. ఓన్లీ రొమాంటిక్!
టాలీవుడ్ సీనియర్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు సినిమాలు చేసిన ఆకాష్ పూరి సరైన విజయాన్ని అందుకోలేదు. తండ్రి దర్శకత్వంలో తెరకెక్కిన మహబూబా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సారి ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని రొమాంటిక్ అనే సినిమాతో రాబోతున్నాడు.
ఈ సినిమాకు పూరి జగన్నాథ్ స్టోరీ స్క్రీన్ ప్లే మాటలు అందించగా ఆయన శిష్యుడు అనిల్ పడురి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి ట్రైలర్ ను నేడు ప్రభాస్ చేతులమీదుగా విడుదల చేశారు. ఇక ట్రైలర్ లోకి వెళితే పూరి మార్క్ కు తగ్గట్టుగా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ రిలీజ్ చేసిన రొమాంటిక్ ట్రైలర్
మొదట తెలంగాణ పోరి అనే సినిమాతో హీరోగా పరిచయమైన ఆకాష్ పూరి అంతకుముందే పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు. ఇక మళ్ళీ తండ్రి దర్శకత్వంలోనే మెహబూబా అనే ఒక డిఫరెంట్ లవ్ స్టొరీ ట్రై చేశాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు పూరి జగన్నాథ్ శిష్యుడు డైరెక్ట్ చేసిన రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను ఈ నెల 29 విడుదల చేయబోతున్నారు. ఇక ప్రభాస్ చేతుల మీదుగా సినిమా ట్రైలర్ ను విడుదల చేయించారు.

పూరి మార్క్ డైలాగ్స్
రొమాంటిక్ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇది పూరి జగన్నాథ్ స్టైల్ లోనే ఉన్నట్లు అర్థమవుతోంది. హీరో హీరోయిన్ ఆమెతో ప్రేమలో పడకుండా కేవలం రొమాన్స్ కోసమే తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. మనిషిని లవ్ బలహీనపరుస్తుంది పని పూరి మార్క్ డైలాగ్స్ కూడా కనిపిస్తున్నాయి. హీరోకి తగ్గట్లుగానే హీరోయిన్ కూడా అలాంటి పాత్రల్లోనే భిన్నంగా కనిపిస్తున్నట్లు అర్థమవుతోంది.

హీరోయిన్ అందాలకు ఎట్రాక్ట్
ఈ సినిమాలో నటిస్తున్న కేతికా శర్మా చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. హీరో ఆకాష్ పూరి కూడా మొదటి సారి డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తున్నాడు. అతని వాయిస్ కూడా చాలా దీటుగా కూడా ఉన్నట్లు అర్థమవుతోంది. ఐ లైక్ థిస్ ఎనిమాల్ అంటూ పూరి సినిమా తరహా డిఫరెంట్ మెంటల్టీతో కనిపిస్తున్న ఆకాష్ రోల్ హీరోయిన్ అందాలకు ఎక్కువగా ఎట్రాక్ట్ అయినట్లు అర్థమవుతోంది.

వెక్కి వెక్కి ఏడుస్తారు.
ఆడదానితో పెట్టుకుంటే సంకనాకి పోతావ్ అంటూ మరొక పవర్ఫుల్ డైలాగ్ కూడా హైలెట్ చేశారు. ఇక రొమాంటిక్ యాంగిల్ లో పట్టుకున్నాడు అంటూ హీరోయిన్ చెప్ప డం కూడా చాలా విభిన్నంగా ఉంది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రమ్యకృష్ణ కనిపిస్తున్నారు. ఒక మనిషికి లవ్ అనేది చాలా వీక్ పాయింట్. సాధారణంగా లవ్ లో తేడా వస్తే ఆడవాళ్ళు ఏడుస్తారు. అదే మగవాళ్ళైతే వెక్కి వెక్కి ఏడుస్తారు. నాకు ఏడవడం నచ్చదు అని హీరో ఆకాష్ చెప్పే డైలాగ్ కూడా నేటి తరానికి తగ్గట్లుగానే ఉంది.
ప్రేమలో ఉన్నప్పటికీ..
ఇద్దరు లవ్ చేసుకోకుండా ఏం చేసుకుంటారు అని రమ్యకృష్ణ చెప్పిన డైలాగ్ కు ఏదో ఒకటి చేసుకుంటామని కేతికా శర్మ సమాధానం చెప్పడం మరింత భిన్నంగా ఉంది. చూస్తుంటే ఈ రొమాంటిక్ సినిమా చాలా బోల్డ్ గా ఉండేలా ఉందని అనిపిస్తుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ చివరగా ఇస్మార్ట్ శంకర్ సినిమా లో చూపించిన రొమాంటిక్ యాంగిల్ ను ఈ సినిమాలో అంతకుమించి అనేలా చూపించబోతున్నాడు అర్థమవుతోంది. చాలామంది మొహానికి పెట్టుకునే పేరు ప్రేమ.. కానీ ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పటికీ కూడా మొహం అని అనుకుంటున్నారు.. అని మరొక భిన్నమైన కథను చెప్పబోతున్న ట్లు తెలుస్తోంది. అక్టోబర్ 29 న విడుదల కాబోయే ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











