Chor Bazar కోట్లు విలువ చేసే వజ్రం చోరి.. మాస్ ఎలిమెంట్స్‌తో చోర్ బజార్‌ రిలీజ్ ట్రైలర్

ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో గెహనా సిప్పీ నాయికగా నటించింది. డైరెక్టర్ జీవన్ రెడ్డి తెరకెక్కించారు. ఆయన ఫస్ట్ ఇలాంటి మాస్ మూవీ చేశారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఆకాష్ పూరికి కెరీర్ లో ఒక డిఫరెంట్ మూవీగా చోర్ బజార్ నిలుస్తుందని అంచనాలు ఏర్పడుతున్నాయి.

ఇదిలా ఉండగా.. సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన చిత్రాలు ఏవంటే? అవి మాస్ ఎంటర్‌టైన్ చిత్రాలే అని చెప్పవచ్చు. మాస్ ఎలిమెంట్స్‌తో వచ్చిన చిన్న హీరోల సినిమాలు కూడా భారీ విజయాలు సాధించాయి. అలాంటి కోవలోనే జూన్ 24వ తేదీన రిలీజ్ అవుతున్న చిత్రం చోర్ బజార్. ఇప్పటి వరకు దళం, జార్జిరెడ్డి లాంటి రెబల్ చిత్రాలు అందించిన దర్శకుడు జీవన్ రెడ్డి తన రూట్ మార్చి చేసిన కలర్‌ఫుల్ చిత్రం చోర్ బజార్. ఆకాశ్ పూరి, గెహానా సిప్పీ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Akash Puris Chor Bazar movie release trailer goes viral

చోర్ బజార్ సినిమా తెరపైకి వచ్చేందుకు రెడీ అవుతుండగా... మాస్ ఎలిమెంట్స్ ఉన్న ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ రిలీజ్ ట్రైలర్‌లో కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాన్ని దొంగలు కొట్టేయడం, అది చోర్ బజార్ కు చేరడం కీలకమైన అంశంగా కనిపించింది. డైమండ్ చోరి నేపథ్యంలో జరిగే చోరులు, పోలీసుల హంగామా ఆకట్టుకొంది.

బచ్చన్ సాబ్ (ఆకాశ్ పూరి) ఉన్నంతవరకు చోర్ బజార్‌ను ఏమీ చేయలేమని విలన్స్ మాట్లాడుకోవడం, చివరకు చోర్ బజార్‌ను మూసేయాలని కొందరి కుట్రలు వర్కవుట్ కావడం ట్విస్టుగా కనిపించింది.

కోర్టు ఆదేశాలతో చోర్ బజార్‌ను మూసేయడం, బచ్చన్ సాబ్‌ను పట్టుకోవడం కష్టమే కాదు అసాధ్యమని ఆకాష్ చెప్పిన మాస్ డైలాగ్స్‌తో నింపేసిన ఈ ట్రైలర్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనే క్యూరియాసిటీ పెంచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X