టాప్‌లెస్‌గా హీరోయిన్.. 'రొమాంటిక్' డోస్ మామూలుగా లేదండీ బాబు! ఫస్ట్‌లుక్ రిలీజ్

Recommended Video

Akash Puri's Romantic Movie First Look Released !

ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూరి జగన్నాథ్ మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. అయితే అప్పుడు దర్శకుడిగా అయితే.. ఇప్పుడు నిర్మాతగా. ఎంతైనా మల్టీటాలెంటెడ్ పర్సన్ కదా!. పూరి జగన్నాథ్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోంది 'రొమాంటిక్' మూవీ. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసి హీటెక్కించాడు పూరి జగన్నాథ్. ఆ విశేషాలేంటో చూద్దామా..

పూరి తనయుడు ఆకాష్ పూరి

పూరి తనయుడు ఆకాష్ పూరి

తన కొడుకు ఆకాష్ పూరీని ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కించి స్టార్ హీరోని చేయాలని తాపత్రయ పడుతున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ మేరకు తన స్వీయ దర్శకత్వంలో కొడుకు హీరోగా పెట్టి 'మెహబూబా' సినిమా రూపొందించారు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితం రాబట్టక పోవడంతో మరో దర్శకుడికి తన కొడుకు బాధ్యతను అప్పజెప్పారు.

రొమాంటిక్ డోస్ మరింత పెంచేసి

రొమాంటిక్ డోస్ మరింత పెంచేసి

ఆ దర్శకుడే అనిల్ పాదూరి. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమానే 'రొమాంటిక్'. ఈ సినిమాలో ఆకాష్ పూరి హీరోగా నటిస్తుండగా అందాల భామ కేతికశర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. పూరి కెనెక్ట్స్ బ్యానర్‌పై స్వయంగా పూరి జగన్నాథ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే పేరుకు తగ్గట్టే ఈ సినిమాలో రొమాంటిక్ డోస్ మరింత పెంచేసి ఫస్ట్‌లుక్ విడుదల చేశారు.

 టాప్‌లెస్‌గా హీరోయిన్.. సెన్సేషనల్ పిక్

టాప్‌లెస్‌గా హీరోయిన్.. సెన్సేషనల్ పిక్

తాజాగా విడుదలైన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ యూత్ ఆడియన్స్‌కి కిక్కించింది. హీరోయిన్ కేతికశర్మను టాప్ లెస్‌గా వెనుక నుంచి చూపించి అందరి దృష్టినీ లాగేశారు. ఇక టాప్ లెస్‌గా ఉన్న హీరోయిన్‌ని తన కేతులతో చుట్టిపడేశాడు ఆకాష్ పూరి. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తుంటే రొమాంటిక్ సినిమాలో రొమాన్స్ పీక్స్ స్టేజ్‌లో ఉంటుందని అర్థమవుతోంది.

శరవేగంగా షూటింగ్.. ప్రస్తుతం

శరవేగంగా షూటింగ్.. ప్రస్తుతం

చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్ప‌టికే హైద‌రాబాద్‌, గోవా షెడ్యూల్స్‌ పూర్తి పూర్తి చేసుకుంది. ఈ రోజు (సోమ‌వారం) నుండి కొత్త షెడ్యూల్ మళ్ళీ హైద‌రాబాద్‌ లోనే ప్రారంభం కానుంది. ఇస్మార్ట్ శంక‌ర్‌ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌‌పై రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 అంతకు మించి అనేలా డోస్ పెంచేసి

అంతకు మించి అనేలా డోస్ పెంచేసి

పూర్తి స్థాయిలో యూత్‌‌ను టార్గెట్ చూస్తూ పూరీ తరహా ప్రేమ కథా చిత్రంగా రొమాంటిక్ సినిమా రూపొందుతోందని తలుస్తోంది. పూరి జగన్నాథ్‌ సూపర్ హిట్ మూవీ 'ఇడియట్' తరహాలోనే ఈ జనరేషన్ అభిరుచికి తగినట్టుగా 'రొమాంటిక్' రూపొందిస్తున్నారని టాక్ నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X