వామ్మో అలా ఎత్తుకున్నాడేంటి.. ఆ హీరో ‘రొమాంటికా’.. మరో ఇడియెటా?

టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలకు మాస్‌ ఇమేజ్‌ను ఇచ్చి.. ఇంకెంతో మందికి బ్లాక్‌ బస్టర్‌హిట్‌లను కట్టబెట్టి వారి కెరీర్‌ను గాడీలో పెట్టాడు డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌. అయితే పూరికి సరైన హిట్టు చాలాకాలమైంది. ఈ తరుణంలో ఇస్మార్ట్‌ శంకర్‌ అంటూ వచ్చి.. పూరి అంటే ఏంటో మరోసారి నిరూపించాడు. మాస్‌ మూవీలకు ఇంకా కాలం చెల్లలేదని మరోసారి ప్రూవ్‌ చేశాడు.

 కొడుకును హీరోగా నిలబెట్టలేని పూరి..

కొడుకును హీరోగా నిలబెట్టలేని పూరి..

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆకాశ్‌ను తనసినిమాలతోనే పరిచయం చేసిన పూరి.. హీరోగా మాత్రం నిలబెట్టలేకపోతున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి హీరో ఇమేజ్‌ను తీసుకురాలేకపోతున్నాడు. ఆంధ్రాపోరితో హీరోగా మారినా.. అదృష్టం కలిసిరాలేదు. మరోసారి పూరి రిస్క్‌ చేసి మెహబూబా అంటూ కొడుకు మీద కాస్త ఎక్కువే ఖర్చుపెట్టాడు. అయితే ఇది కూడా బెడిసికొట్టడంతో ఆలోచనలో పడ్డాడు.

కొడుకు భవిష్యత్తు శిష్యుడి చేతిలో..

కొడుకు భవిష్యత్తు శిష్యుడి చేతిలో..

ఇక తన కొడుకు భవిష్యత్తును శిష్యుడైన అనిల్‌ చేతిలో పెట్టేశాడు. ఈ మూవీలో పూరి ఇన్వాల్వ్‌ కాకుండా మొత్తం ఆయన మీదే భారం వేశారట. మరి ఈ సినిమాతోనైనా హీరోగా నిలబెట్టుకుంటాడా? అన్నది చూడాలి. అయితే మాస్‌ మంత్రం జపించకుండా.. ఓ ‘రొమాంటిక్‌' కథతోనే ఆకాశ్‌ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.

30న ఫస్ట్‌లుక్‌

30న ఫస్ట్‌లుక్‌

పూరి జగన్నాథ్‌ నిర్మిస్తున్న ఈ మూవీ అప్‌డేట్‌ను తాజాగా ప్రకటించారు. సోమవారం ఉదయం 11గంటలకు ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. హీరోయిన్‌ను అమాంతం భుజాలపై ఎత్తుకున్న ఆకాశ్‌ను బ్యాక్‌సైడ్‌ నుంచి చూపించిన ఈ పోస్టర్‌ ఆసక్తిని రేపుతోంది. ఆ పోస్టర్‌ చూస్తుంటే నిజంగానే రొమాంటిక్‌ అనిపిస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

పూరీ తరహాలోనే

పూరీ తరహాలోనే

అయితే పూర్తి స్థాయిలో యూత్‌‌ను టార్గెట్ చూస్తూ పూరీ తరహా ప్రేమ కథా చిత్రంగా రొమాంటిక్ రూపొందితున్నట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా పూరీ జగన్నాథ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టిన ఇడియెట్ తరహాలోనే ఈ జనరేషన్ అభిరుచికి తగినట్టుగా సినిమా ఉండబోతుందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X