‘రొమాంటిక్’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటన: లిప్‌లాక్ పోస్టర్‌తో సర్‌ప్రైజ్ చేసిన పూరీ టీమ్

టాలీవుడ్‌లోనే టాప్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకడు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎంతో మంది హీరోలకు భారీ హిట్లు అందించిన ఘనత ఆయన సొంతం. అంతేకాదు, ఎలాంటి హీరోకైనా తనదైన శైలి మేనరిజం క్రియేట్ చేయడంలో ఆయనకు సాటి ఎవరూ రారు. అలాంటి ఈ డైరెక్టర్.. తన కుమారుడు ఆకాశ్ పూరీకి మాత్రం ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా అందించలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన కొడుకు ఫ్యూచర్‌పై పూరీ జగన్నాథ్ ఫోకస్ చేశాడు. ఇందులో భాగంగానే ఓ కొత్త దర్శకుడితో 'రొమాంటిక్' అనే మూవీని నిర్మించాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.

పూరీ జగన్నాథ్ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో అకాశ్ - కేతిక శర్మ జంటగా నటించిన చిత్రమే 'రొమాంటిక్'. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాను ఛార్మీతో కలిసి పూరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో హీరో హీరోయిన్లు కౌగిలించుకుని ఉన్నారు. అంత వరకూ బాగానే ఉన్నా వాళ్ల ఒంటిపై దుస్తులు లేకపోవడమే అసలు సమస్య. దీంతో ఈ పోస్టర్‌పై సోషల్ మీడియాతో పాటు చాలా మంది సామాన్యులు కూడా విమర్శల వర్షం కురిపించారు. అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయింది.

Akash Puris Romantic movie Release date Announced

వాస్తవానికి ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ.. లాక్‌డౌన్ కారణంగా విడుదల మాత్రం వాయిదా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, అలా జరగలేదు. ఇక, తాజాగా ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను జూన్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు, ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా వదిలింది. ఇందులో ఆకాశ్, కేతిక లిప్‌లాక్ పెట్టుకుంటూ కనిపించారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X