పూరీ ‘రొమాంటిక్’ మూవీ రిలీజ్‌పై క్లారిటీ: త్వరలోనే ఆ ప్రకటన చేయబోతున్న యూనిట్
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని.. బడా డైరెక్టర్‌గా వెలుగొందుతున్నారు పూరీ జగన్నాథ్. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన ఆయన.. హీరోగా పరిచయం అయిన తన కుమారుడు ఆకాశ్ పూరీకి మాత్రం ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా అందించలేకపోయాడు. దీంతో కొడుకుకు ఈ సారి ఎలాగైనా హిట్‌ను అందించాలని భావించిన ఈ డైనమిక్ డైరెక్టర్.. తన శిష్యుడు అనిల్ పాదూరికి ఆ బాధ్యతను అప్పగించాడు. వీళ్ల కాంబోలో వచ్చిన చిత్రమే 'రొమాంటిక్'. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ గురించి తాజాగా ఓ అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.
అనిల్ పాదూరి దర్శకత్వంలో అకాశ్ - కేతిక శర్మ జంటగా నటించిన చిత్రమే 'రొమాంటిక్'. ఈ సినిమాను ఓటీటీలో నేరుగా విడుదల చేయబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ జీ5తో చిత్ర యూనిట్ డీల్ కూడా కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ మధ్య ఆ వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది కూడా. దీంతో ఇది థియేటర్లలోనే వస్తుందన్న క్లారిటీ వచ్చింది. కానీ, ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది తెలియలేదు. తాజా సమాచారం ప్రకారం.. రొమాంటిక్ మూవీని ఆగస్టు నెలాఖరుకు విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'రొమాంటిక్' మూవీని ఆగస్టు చివరి వారంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. ఈ రెండు మూడు రోజుల్లో ఓ డేట్‌ను ఫిక్స్ చేసుకుని.. ఆ వెంటనే దీనిపై అధికారిక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను హీరోయిన్ ఛార్మీతో కలిసి పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తోన్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి దానికి భారీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











