సెంటిమెంట్‌ను ఫాలో అవుతోన్న పూరీ: విజయ్ సినిమాలో అతడి కోసం స్పెషల్ రోల్
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకడు. హీరోలను ఎలివేట్ చేయడంలో ఆయనను మించిన వారు లేరన్న టాక్ కూడా ఉంది. చిన్న హీరో నుంచి పెద్ద స్టార్ వరకు తనదైన శైలి మేనరిజంను క్రియేట్ చేస్తుంటాడాయన. ఇక, కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్న పూరీ.. పలు ఇండస్ట్రీ హిట్లను కూడా అందుకున్నాడు. ఆ తర్వాత వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న సమయంలో 'ఇస్మార్ట్ శంకర్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక, ఇప్పుడు విజయ్ దేవరకొండతో కలిసి 'లైగర్' అనే బడా మూవీ చేస్తున్నాడు.
విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న పాన్ ఇండియా చిత్రమే 'లైగర్'. లాక్‌డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ చాలా రోజులుగా జరగడం లేదు. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న చిత్రీకరణ కోసం టీమ్ మొత్తం ముంబై వెళ్లనుంది. ఈ గ్యాప్‌లో టాలీవుడ్ టాప్ కమెడియన్ అలీ కోసం ఓ స్పెషల్ రోల్ డిజైన్ చేశాడట పూరీ. తన గత చిత్రాల్లో అతడితో ఎన్నో కామెడీ ట్రాకులను ప్రయోగించి సూపర్ సక్సెస్ అయ్యాడు. ఒక రకంగా చెప్పుకోవాలంటే పూరీ జగన్నాథ్ సక్సెస్‌లో అలీ కామెడీ ట్రాకుల పాత్ర కూడా ఉందన్న టాక్ ఉంది. అందుకే ఈ సినిమా కోసం అతడిని తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న 'లైగర్'ను పూరీ జగన్నాథ్, ఛార్మీలతో పాటు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కూడా నిర్మిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరి మూడో వారం నుంచి ముంబైలో పున: ప్రారంభం కాబోతుంది.


Click it and Unblock the Notifications











