సినిమాలో నటించినంత మాత్రాన అలానే ఉండరు.. విజయ్‌పై అనన్య కామెంట్స్
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మూవీ టైటిల్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు గానీ ఫైటర్ అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.. తాజాగా లైగర్ అంటూ టాక్ వినిపిస్తోంది. అయితే ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడితే తాజాగా అనన్య పాండే విజయ్ గురించి చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి.
ఫైటర్‌గా విజయ్ దేవరకొండ నటించబోతోన్న ఈ సినిమాలో విదేశాల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. ఈ మూవీలో విజయ్ సరసన నటింపజేసేందుకు ఎంతో మందిని ప్రయత్నించి చివరకు బాలీవుడ్ రైజింగ్ స్టార్ అనన్య పాండేను తీసుకున్నారు. విజయ్, అనన్య కలిసి ముచ్చటిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో హల్చల్ చేశాయో అందరికీ తెలిసిందే.

తాజాగా ఈ అమ్మడు మాట్లాడుతూ విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. అర్జున్ రెడ్డి చిత్రం గురించి స్పందిస్తూ.. సినిమాలో పోషించిన క్యారెక్టర్ మాదిరిగానే నిజ జీవితంలో ఉండరని, విజయ్ ఆ సినిమాలో అద్భుతంగా నటించాడని కితాబిచ్చింది. అంతేకాకుండా.. అతను చాలా స్మార్ట్ అండ్ కైండ్. అందరితోనూ చాలా కలుపుగోలుగా మాట్లాడతాడని తెలిపింది. సెట్లో ఎప్పుడూ నవ్వుతూ సందడి చేస్తుంటాడని, కొత్తవారితో ఎలా మాట్లాడాలో కలుపుకుపోవాలే తెలుసని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











