Anil Ravipudi: ఏ హీరోని తక్కువ చేయలేదు.. ఫ్యాన్ వార్ పై అనిల్ రావిపూడి క్లారిటీ..

Anil Ravipudi: దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వర ప్రసాద్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా రూ.300 కోట్లకు చేరువైన కలెక్షన్లతో సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. అయితే సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులను ఆగ్రహానికి గురి చేశాయి. దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఫ్యాన్ వార్‌కు చెక్ పెట్టిన అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?

వివాదం ఎలా మొదలైంది?
ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నిస్తూ... 'చిరంజీవి గారు మోహన్‌లాల్, మమ్ముట్టిలా డిఫరెంట్ స్పేస్ సినిమాలు ఎందుకు చేయడం లేదు?' అని అడగగా, అనిల్ రావిపూడి సమాధానం ఇస్తూ.. ఆ సందర్భంలో రజినీకాంత్ ఉదాహరణ ప్రస్తావిస్తూ, ఆయనకు స్టైల్, ఎలివేషన్స్, మేనరిజమ్స్ చాలా కీలకమని, అలాంటి ఎలిమెంట్స్ లేకుండా రజినీకాంత్ సినిమాలను ఆడియెన్స్ అంగీకరించరని వ్యాఖ్యానించారు. ఈ మాటలనే కొందరు రజినీ అభిమానులు తప్పుగా అర్థం చేసుకుని ట్రోలింగ్ మొదలుపెట్టారు.

Anil Ravipudi Clarifies Rajinikanth Comments Says No Hero Was Compared or Insulted

అనిల్ రావిపూడి క్లారిటీ
ఈ ట్రోల్స్‌పై స్పందించిన అనిల్ రావిపూడి స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. 'నేను రజినీకాంత్ గారిని ఒక్క శాతం కూడా తక్కువ చేయలేదు. ఆయన అద్భుతమైన నటుడు. సౌత్ ఇండియాలో ఆయనకు ఉన్న ఫ్యాన్ క్రేజ్ వేరే లెవల్. ఆయన వాకింగ్ స్టైల్, మేనరిజమ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో వచ్చే ఎలివేషన్స్ ఐకానిక్. 'జైలర్'లో ఆయన వాక్ చూసి అందరూ ఫిదా అయ్యారు'అని అన్నారు. అలాగే చిరంజీవి గురించి మాట్లాడుతూ, 'చిరంజీవి గారికి డ్యాన్స్, కామెడీ టైమింగ్, ఎనర్జీ లాంటి ప్రత్యేక బలాలు ఉన్నాయి. ఇద్దరూ తమ తమ రంగాల్లో టాప్. వీరిని ఒకరితో ఒకరు పోల్చడం అస్సలు సరికాదు'అని తేల్చిచెప్పారు.

Kalki 2: దీపికా స్థానంలో స్టార్ హీరోయిన్? నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!
ప్రతి హీరోకు ప్రత్యేక ఇమేజ్
అనిల్ రావిపూడి తన అభిప్రాయాన్ని మరింత వివరిస్తూ... 'ప్రతి హీరోకు ఒక ప్రత్యేక ఇమేజ్, స్ట్రెంత్ ఉంటుంది. వెంకటేష్ గారు ఫ్యామిలీ ఎంటర్టైనర్లు చేస్తే ఒక ప్రత్యేకమైన ఎనర్జీ కనిపిస్తుంది. బాలకృష్ణ గారు కత్తి పట్టుకుంటే అదే మాస్ ఎలివేషన్. ఆయనను సాఫ్ట్‌గా ఊహించలేం. అలాగే రజినీకాంత్ సినిమాల్లో స్టైల్, స్లో మోషన్ షాట్స్, పవర్‌ఫుల్ BGM తప్పనిసరి. చిరంజీవి సినిమాల్లో డ్యాన్స్, ఫైట్స్ ఎంత ముఖ్యమో, రజినీ సినిమాల్లో స్టైల్ అంతే అవసరం' అని వివరించారు.

ఫ్యాన్ వార్‌పై ఆవేదన
అనిల్ మాట్లాడుతూ.. 'నేను చెప్పాలనుకున్నది ఒక్కటే... హీరోలను పోల్చకూడదు. కానీ యాంకర్ కంపారిజన్‌తో ప్రశ్న అడిగారు. నా మాటలను తప్పుగా అర్థం చేసుకుని ఫ్యాన్ వార్ స్టార్ట్ చేశారు. ఏ హీరోని గానీ, వారి ఇమేజ్‌ని గానీ, నటనను గానీ తక్కువ చేసి మాట్లాడలేదు' అంటూ అనిల్ రావిపూడి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వివాదంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రజినీకాంత్ అభిమానులు అనిల్ రావిపూడి వ్యాఖ్యలను తప్పుబడుతూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తుండగా, మరికొందరు మాత్రం ఆయన చెప్పిన మాటల్లో తప్పేమీ లేదని, ప్రతి హీరో స్టైల్‌ను గౌరవించాల్సిందేనని మద్దతిస్తున్నారు. ఇలా అనిల్ రావిపూడి చేసిన తాజా క్లారిటీతో మెగాస్టార్ - సూపర్‌స్టార్ మధ్య అనవసరంగా చెలరేగిన ఫ్యాన్ వార్‌కు చెక్ పడినట్టే కనిపిస్తోంది. హీరోల ఇమేజ్‌ను దాటి ప్రయోగాలు చేయకూడదన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X