Sandeep Reddy Vanga: సినిమా విడుదలకు ముందే సందీప్ రెడ్డి వంగాకు ఆ ప్రొడ్యూసర్ అంత పెద్ద గిఫ్టు ఇచ్చాడా?
సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అర్జున్ రెడ్డి సినిమాతో సైలెంట్ గా వచ్చి ప్రభంజనం సృష్టించిన ఈ డైరెక్టర్ తన మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాధించుకున్నాడు. 5 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు 50 కోట్ల కలెక్షన్లు వచ్చాయంటే సందీప్ రెడ్డి టాలెంట్ ను అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయిన ఈ కుర్ర డైరక్టర్ అర్జున్ రెడ్డి చిత్రాన్ని కబీర్ సింగ్ గా తీశాడు. అక్కడ కూడా ఫుల్లుగా కలెక్షన్లు సంపాధించాడు.
అయితే తాజాగా ఆయన మరో కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అదే యానిమల్ చిత్రం. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నాలు ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టార్ హీరోహీరోయిన్లు.. అందులోనూ క్రేజీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఫుల్ బజ్ ఏర్పడింది. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా టీజర్, సాంగ్స్ చూస్తుంటేనే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుకుంటోంది.

యానిమల్ సినిమాను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మిస్తున్నారు. అయితే డిసెంబర్ ఒకటో తేదీన చాలా గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమా డైరెక్టర్ కు సినిమా రిలీజ్ కు ముందే ప్రొడ్యూసర్ స్పెషల్ గిఫ్టు ఇచ్చాడు. సినిమా విడుదల అయి ఫుల్ లాభాలు వచ్చాక ప్రొడ్యూసర్లు.. డైరెక్టర్లు లేదా యాక్టర్లకు బహుమతులు ఇవ్వడం మనకు తెలిసిన విషయమే. కానీ ఈ చిత్ర ప్రొడ్యూసర్ మాత్రం.. సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టు కొడుతుందనే నమ్మకంతో ముందుగానే బహుమతి ఇచ్చాడు.
అలా అని అదేదో సాదాసీదా బహుమతి అనుకునేరు. చాలా కాస్ట్లీ గిఫ్టును ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఇచ్చారు. 5 కోట్ల రూపాయల విలువ చేసే కారును సందీప్ రెడ్డి వంగా అందుకున్నారు. గతంలో వచ్చిన కబీర్ సింగ్ సినిమా వల్ల కూడా నిర్మాత భూషణ్ కుమార్ అనేక లాభాలను ఆర్జించాడు. అలాగే యానిమల్ సినిమా కూడా రిలీజ్ కు ముందే చాలా లాభాలు తెచ్చిపెట్టిందట. అందుకే ఆయన యానిమల్ చిత్రం విడుదలకు ముందే 5 కోట్ల రూపాయల కారును గిఫ్టుగా అందించారు.

అయితే ఈ వార్త బయటకు రావడంతో అంతా షాకవుతున్నారు. ఇంత కాస్ట్లీ కారును గిఫ్టుగా ఇవ్వడం అంటే మాటలు కాదని.. బాలీవుడ్ కోడై కూస్తోంది. ఇప్పటి వరకూ ఏ సినిమా డైరెక్టర్ కూడా ఇంత ఖరీదైన కారును గిఫ్టుగా అందుకోలేరు. మొదటి సారి సందీప్ రెడ్డి వంగానే ఇంత కాస్ట్లీ గిఫ్టు అందుకొని రికార్డు సృష్టించారు. అయితే అంచనాలకు తగ్గట్లుగానే యానిమల్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా మారి బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తే.. సందీప్ రెడ్డి వంగా రేంజ్ మరింత పెరిగిపోతుంది. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











