ఎనర్జిటిక్ స్టార్ సరసన హాట్ హీరోయిన్.. పూరిని ఆకట్టుకున్న ముద్దుగుమ్మ ఎవరంటే!
సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్‌లో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం బిజీగా షూటింగ్ జరుపుకొంటున్నది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించిన వార్త ఆసక్తిని రేపింది.
అజాతవాసి, శైలజారెడ్డి అల్లుడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నారట. త్వరలోనే పూరి కనెక్ట్స్ ఈ హీరోయిన్ ఎవరనే విషయం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయినైతే కెమిస్ట్రీ బ్రహ్మండంగా వర్కవుట్ అయ్యే అవకాశం లేకపోలేదనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. పూరి చిత్రంలో అను ఇమ్మన్యుయేల్ బ్రహ్మండమైన సక్సెస్ అందుకుంటోదో వేచి చూడాల్సిందే. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా అర్జున్ రెడ్డి ఫేమ్ రాజు తోట పనిచేస్తున్నారు.


Click it and Unblock the Notifications











