Guntur kaaram: మూవీలో బయటపడ్డ పెద్ద తప్పు.. అసలైందే అలా వదిలేస్తే ఎలా గురూజీ!
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న సినిమా పేర్లలో 'గుంటూరు కారం' ఒకటి. అంతలా ఈ చిత్రం అన్ని విభాగాల్లోనూ ప్రభావాన్ని చూపిస్తూ సత్తా చాటుతోంది. దీనికి ముఖ్య కారణం ఈ మూవీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కడమే. అలా ఈ చిత్రం భారీ అంచనాలను ఏర్పరచుకుని తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. కానీ, ఇందులో ఓ ముఖ్యమైన అంశంలో తప్పు జరిగినట్లు ఆడియెన్స్ ఫైర్ అవుతున్నారు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!
Recommended Video

గురూజీతో వచ్చిన మహేశ్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన కమర్షియల్ మూవీనే 'గుంటూరు కారం'. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు.

గ్రాండ్‌గా రిలీజ్... హవానే : రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న 'గుంటూరు కారం' మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వేల సంఖ్యలో విడుదల చేశారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకుల గోలతో దద్దరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లన్నీ కళకళలాడుతున్నాయి. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా హవాను చూపిస్తోంది.
అలాంటి టాక్ వచ్చింది : సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన షోలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పడిపోయాయి. ఈ మూవీకి టాక్ కూడా డీసెంట్‌గానే లభించింది. అంతటా దీనికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే వచ్చింది. దీంతో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
Shivathmika Rajashekar: శివాత్మిక అందాల అరాచకం.. అసలైన భాగాలనే హైలైట్ చేస్తూ!
సినిమాలోనూ పెద్ద తప్పు : మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీ ఇప్పటికే అన్ని ఏరియాల్లోనూ ప్రదర్శితం అయింది. దీనికి టాక్, స్పందనను పక్కనపెడితే చిత్ర యూనిట్ చేసిన ఓ తప్పు బాగా హైలైట్ అవుతోంది. అదే ఈ సినిమా సౌండ్ మిక్సింగ్ ప్రాబ్లం. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రింట్‌లో ఇది సుస్పష్టంగా కనిపించినట్లు కొందరు ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా కంప్లైంట్ చేస్తున్నారు.
డైలాగ్ డామినేట్ చేసేలా : ఓవర్సీస్‌లో 'గుంటూరు కారం' సినిమాను చూసిన చాలా మంది నెటిజన్లు సౌండ్ మిక్సింగ్ ప్రాబ్లంను హైలైట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ డైలాగులను డామినేట్ చేసిందని చెప్తున్నారు. దీంతో హీరో పలికే సంభాషణల్లో క్లారిటీ మిస్ అయిన ఫీలింగ్ వచ్చిందట. ఇదే అంశాన్ని చాలా మంది ప్రస్తావిస్తున్నారు. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారిపోయింది.

ట్రైలర్‌లో కూడా అలాగే : 'గుంటూరు కారం' మూవీ ట్రైలర్ విషయంలో కూడా ఈ కంప్లైంట్ బాగానే వినిపించింది. ఇందులో సౌండ్ మిక్సింగ్ సరిగా కుదరలేదని చాలా మంది చెప్పారు. ముఖ్యంగా ఈ ట్రైలర్‌ను హోం థియేటర్‌లో కానీ, టీవీలో కానీ ప్రసారం చేస్తే డైలాగ్స్ క్లారిటీ రాలేదు. సినిమా థియేటర్లలో కూడా ఇలా ఉంటే సమస్య అవుతుందని ఫ్యాన్స్ భయపడ్డారు. ఇప్పుడు అలాగే జరిగింది.


Click it and Unblock the Notifications











