Anil Ravipudi: బిగ్ బ్రేకింగ్.. రాజకీయాల్లోకి డైరెక్టర్ అనిల్ రావిపూడి.. పార్టీ పెడుతున్నట్లు వీడియో రిలీజ్
దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన మార్క్ కామెడీతో సినిమాలు తెరకెక్కించి.. ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. తీసిన ఏ సినిమా కూడా డిజాస్టర్ కాకుండా.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ డైరెక్టర్.. కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు వీడియోలో అనౌన్స్ చేశాడు. ఎవరూ ఊహించని వీడియో రిలీజ్ చేసి.. ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. త్వరలో తను రాజకీయాల్లోకి వచ్చేస్తున్న అంటూ చెప్పుకువచ్చాడు. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. తీసిన ఏ సినిమా అయినా మినిమం గ్యారెంటీ.. తన దైన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు ఈ దర్శకుడు. పటాస్ నుంచి మొదలు అయిన ఆయన ప్రయాణం.. మొన్నటి భగవంత్ కేసరి వరకు కొనసాగుతూనే ఉంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ.. స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు అనిల్ రావిపూడి. ఆయన సినిమా తీస్తే... యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ వరకు అందరూ కలిసి చూసేలా ఉంటుంది. అంతలా క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ డైరెక్టర్.

ఇక ఇటీవల నందమూరి నటసింహం బాలకృష్ణతో కలిసి భగవంత్ కేసరి సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమాలో కామెడితో పాటు.. ఎమోషన్స్ కలగలపి తెరకెక్కించాడు. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ నటించగా.. కూతురి పాత్రలో శ్రీలీల నటించింది. ఇక తమన్ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచింది. మొత్తానికి బాలయ్యతో అనిల్ రావిపూడి హిట్ కొట్టాడు. 100కోట్ల రూపాయలకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేసి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

ఇదిలా ఉంటే.. అనిల్ రావిపూడి నెక్ట్స్ మూవీ గురించి అనౌన్స్ ఇస్తాడు అనుకుంటే.. ఓ వీడియో రిలీజ్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ వీడియోలో అనిల్ రావిపూడి రాజకీయ నాయకుడి డ్రెస్ వేసుకుని.. సీరియస్ గా మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ వీడియోలో తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు వెల్లడించారు.

ఇక ఆ వీడియోలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.... ఇప్పటి వరకు నా బాక్సాఫీస్ విజయాన్ని చూసారు.. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ విజయం కోసం ఎదురుచూస్తున్నా... నేను కొత్త పార్టీ పెడుతున్నా... త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తా.. అంటూ ఆ వీడియోలో దర్శకుడు అనిల్ రావిపూడి సంచనలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. మొత్తానికి నెటిజన్లను గందరగోళంలో పడేశారు అనిల్ రావిపూడి.
Polimera: పొలిమేర సినిమాలో షేక్ చేసిన ఆ పాత్రను మిస్ చేసుకున్న నటుడు ఎవరో తెలుసా?
ఇక ఈ వీడియోను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. దీంతో ఇది ఏదో ప్రోగ్రామ్ వీడియో అని తెలుస్తోంది. పొలిటికల్ వెబ్ షో లేదా వెబ్ సినిమానా అనేది తెలియాల్సి ఉంది. ఇక పూర్తి వివరాలు త్వరలోనే తెలియనుందని తెలుస్తోంది. ఆహా వేదికగా ఇప్పటికే అనిల్ రావిపూడి పలు కామెడీ షోలు చేశారు. జడ్జ్ గా ఉంటూ ఇప్పటికే ఓ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఇప్పుడు మరో ప్రోగ్రాం చేయబోతున్నాడా అని నెటిజన్స్ అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











