47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న స్టార్ హీరో.. వధువు ఎవరో కాదు ప్రియురాలే!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌దీప్‌ హుడా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2001లో మాన్ సూన్ వెడ్డింగ్ సినిమా ద్వారా బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత కూడా అదిరిపోయే చిత్రాల్లో నటించాడు. ముఖ్యంగా మోస్ట్ హ్యాండ్ సమ్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈయన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, సాహెబ్, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్, జన్నత్ 2, జిస్మ్ 2, కాక్‌ టెయిల్ , కిక్, రసియా, హైవే, సర్బ్‌ జిత్ వంటి బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాల్లో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు.

ప్రస్తుతం ఈయన స్వతంత్ర వీర సావర్కర్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే... ఈ చిత్రంలో నటిస్తున్నాడు. 2001 నుంచి ఇప్పటికీ హీరోగా కొనసాగుతూనే ఉన్నాడు. అద్భుతమైన టాలెంట్ ఉన్న టాప్ హీరోల్లో ఒకరు అయిన ఈయనకు ప్రస్తుతం 47 ఏళ్లు. అయితే 50 సంవత్సరాలకు దగ్గర అవుతున్న ఈయన తాజాగా పెళ్లి చేసుకుని షాకిచ్చాడు. ప్రస్తుతం ఆయన పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తాను ఓ ఇంటి వాడు అయినట్లు నేరుగా ఆయనే ఇన్ స్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చాడు. ఫ్రమ్ టుడే.. వీ ఆర్ వన్ అని దిల్ సింబల్ తో పాటు ఇన్సినిటీ సింబల్ ను పెట్టాడు.

Bollywood Star Hero Randeep Hooda Married His Gilr Friend Lin Laishram And Photos Goes Viral

మణిపూర్ లో అతి తక్కువ మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల నడుమ వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. అలాగే తన పెళ్లి సమయంలో దిగిన ఫొటోలను పెట్టాడు. పెళ్లి డ్రెస్ లో రణ్‌దీప్‌ హుడా.. ఆయన భార్య లిన్ లైశ్రామ్ చాలా అందంగా కనిపిస్తున్నారు. వైట్ అండ్ వైట్ లో రణ్‌దీప్‌ హుడా మెరిసిపోతుండగా... ఆయన భార్య మరింత చక్కగా కనిపిస్తున్నారు. అయితే రణ్‌దీప్‌ హుడా పెళ్లి చేసుకున్నది మరెవరినో కాదండి ఆయన ఎంతో కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న ఈయన ప్రియురాలు లిన్ లైశ్రామ్ నే. ఈమె మోడల్, నటిగా సినీ రంగంలో కొనసాగుతున్నారు.

రణ్‌దీప్‌ హుడా, లిన్ లైశ్రాయ్ లు చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు, ప్రేమాయణం సాగిస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ వీరు చాలా కాలం పాటు దీన్ని బయట పెట్టలేదు. గతేడాదే వీరిద్దరూ తమ బంధం గురించి అఫీషియల్ గా ప్రకటించి అందరి చేత ఆహా అనిపించుకున్నారు. అయితే ప్రేమించుకుంటున్నట్లు చెప్పిన సంవత్సరానికి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి పెళ్లి ఫొటోలు చూసిన అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.

కంగ్రాట్స్.. మీరు జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉండండి అంటూ రణ్‌దీప్‌ హుడా చేసిన పోస్టుకు కామెంట్లు పెడుతున్నారు. అలాగే వీరిద్దరి పెళ్లి ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తూ... మరింత వైరల్ చేస్తున్నారు. ఇంత అందమైన ఫొటోలను మీరూ ఓసారి చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X