Year Ender 2023: బాలీవుడ్ బాద్షా టాప్ 10 హిట్ సినిమాలు ఇవే.. ఇందులో మీకు నచ్చిన షారుఖ్ సినిమా ఉందా?
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందానికి అందం, అంతకు మించిన అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయిన ఈయన గురించి దేశ ప్రజలందరికీ తెలిసిందే. అయితే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా ఓ లిస్టును విడుదల చేసింది. 2010 నుంచి ఇప్పటి వరకు బాలీవుడ్ బాద్షా హీరోగా నటించిన సినిమాల్లో.. దేశ ప్రజలు మెచ్చిన టాప్ 10 చిత్రాల లిస్టును విడుదల చేసింది. అయితే ఆ లిస్టులో ఏయే చిత్రాలు ఉన్నాయి, అందులో మీకు నచ్చింది ఏదైనా ఉందా లేదా అనేది చూద్దాం.
1. జవాన్:
షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి కాంబోలో వచ్చిన జవాన్ చిత్రం 2023 సెప్టెంబర్ 7వ తేదీన విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది ఈ సినిమా అట్లీ కుమార్ దర్శకత్వం వహించగా.. రెడ్ చిల్లీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌరీ ఖాన్ నిర్మించారు.

2. పఠాన్:
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణ, సల్మాన్ ఖాన్ ల కాంబోలో వచ్చిన 2023లో జనవరి 25వ తేదీన విడుదల అయింది. ఆదిత్య చోప్రా, మ్యాక్సిన్ అజ్ఞాని ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది.
3. చెన్నై ఎక్స్ ప్రెస్:
రోహిత్ శెట్టి డైరెక్షన్ లో 2013 ఆగస్టు 8వ తేదీన విడుదల అయిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా కూడా హిట్టుగా నిలిచింది. దీపికా పదుకొణె, షారుఖ్ ఖాన్ లు హీరోహీరోయిన్లుగా నటించి మెప్పించారు.

4. డాన్ 2:
2011 డిసెంబర్ 23వ తేదీ రోజు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో వచ్చిన డాన్ 2 సినిమా హిట్టుగా నిలిచింది. ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్, యశ్ రాజ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, ఫర్హాన్ ఖాన్, ప్రియాంక చోప్రాలు నటించారు.
5. రయీస్:
రాహుల్ ధోలకియా డైరెక్షన్ లో 2017 జనవరి 25వ తేదీన వచ్చిన రయీస్ సినిమాలో షారుఖ్ ఖాన్, మహిరా ఖాన్, నవాజుద్దిన్ సిద్దికీ, సన్నీ లియోనీలు నటించి మెప్పించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.
6. డియర్ జిందగీ:
గౌరీ షిండే డైరెక్షన్ లో వచ్చిన డియర్ జిందగీ సినిమా 2016 నవంబర్ 25వ తేదీన విడుదల అయింది. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్, ధర్మ ప్రొడక్షన్స్, హోప్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా అలియా భట్, షారుఖ్ ఖాన్ లు నటించి మెప్పించారు.
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, వివాన్ షాహ్, అభిషేక్ బచ్చన్ లు నటించిన హ్యాపీ న్యూ ఇయర్ సినిమా 2014 అక్టోబర్ 24వ తేదీన విడుదల అయింది. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచి ట్రెండ్ సెట్ చేసింది.

8. మై నేమ్ ఈజ్ ఖాన్:
మై నేమ్ ఈజ్ ఖాన్ అనే సినిమా 2010 ఫిబ్రవరి 12వ తేదీన విడుదల అయింది. కరణ్ జోహాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షాకుఖ్ ఖాన్, కాజోల్, ఆదర్శ్ గౌరవ్ లు నటించి మెప్పించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

9. జబ్ తక్ హై జాన్:
యశ్ రాజ్ స్టూడియోస్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాను 2012 నవంబర్ 13వ తేదీన గ్రాండ్ గా విడుదల అయింది. యశ్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.
రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2015 డిసెంబర్ 18వ తేదీన విడుదల అయింది. షారుఖ్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కృతి సనన్ లు నటింటి మెప్పించిన ఈ సినిమా సూపర్ డూపర్ హి్టుగా నిలిచింది.


Click it and Unblock the Notifications











