జాన్వీపై వెల్లువెత్తుతున్న రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన బోనీ కపూర్

అందాల తార, దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోందంటూ గత కొంతకాలంగా వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఇలాంటి వార్తలు గతంలో ఎప్పటి నుంచో వస్తున్నప్పటికీ.. విజయ్ దేవరకొండతో పూరిజగన్నాథ్ మూవీ కన్ఫర్మ్ చేశాక మరింత ముదిరాయి. ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ గడప తొక్కుతోందని వార్తలు విన్నాం.

ఇంతలో జాన్వీకి సౌత్ ఇండియా సినిమాల్లో నటించడం ఇష్టం లేదంటూ మరికొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. జాన్వీకి బాలీవుడ్‌లో తప్ప టాలీవుడ్‌లో నటించదని, ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు దక్షిణ భారత సినిమాల్లో నటించేందుకు ఆమె ఆసక్తిగా లేదనే వార్తలు సృష్టించారు కొందరు. తాజాగా ఈ ఇష్యూపై జాన్వీ తండ్రి నిర్మాత బోనీ కపూర్ స్పందించారు.

 Boney Kapoors clarity On Janhvi Kapoor Tollywood entry

తన కూతురు జాన్వీకి కానీ, తమ కుటుంబానికి కానీ దక్షిణ భారత దేశ సినిమాలంటే ఎంతో ప్రేమ అని ఆయన అన్నారు. ''దక్షిణాది చిత్రాలంటే మా కుటుంబానికి చాలా చాలా ఇష్టం. గతంలో శ్రీదేవి ఎన్నో దక్షిణాది చిత్రాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకుల మన్ననలు పొందింది. టాలీవుడ్ చిత్రసీమలో చిరంజీవి, కృష్ట వంటి వారితో మాకు మంచి అనుభందం ఉంది. మంచి కథ దొరికితే దక్షిణాది సినిమాలు చేసేందుకు జాన్వీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది'' అని బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చారు.

ఇక పూరి- విజయ్ దేవరకొండ కాంబో సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాను పూరి, చార్మి సంయుక్తంగా నిర్మించబోతున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా విజయంతో జోష్‌లో ఉన్న పూరి జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ అయ్యేలా ఈ సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. చిత్రానికి ఫైటర్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. నటీనటుల వివరాలు త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటించనున్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X