LIGER - Mike Tyson పాత్రపై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. మతిపోవడం పక్కా!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఎంతో ఆసక్తిగా ఉంటుందని చిత్ర యూనిట్ ఇది వరకే చాలాసార్లు వివరణ ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ మాత్రమే విడుదలైంది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే విజయ్ దేవరకొండ భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు మరొక అఫీషియల్ అప్డేట్ తో ముఖ్యమైన క్లారిటీ కూడా ఇచ్చేశాడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ అందుకున్నన్నటువంటి బాక్సింగ్ గాడ్ మైక్ టైసన్ లైగర్ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు.

Recommended Video

Liger - Boxing Legend Mike Tyson In Vijay Deverakonda's Liger

వీడియో ద్వారా క్లారిటీ


విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్లుగానే విడుదల కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. దానికితోడు మైక్ టైసన్ రంగంలోకి దింపడం తో అంచనాలు మరింతగా పెరిగాయి. గత ఏడాది నుంచి ఈ విషయంలో కొంత కన్ఫ్యూజన్ వస్తున్నప్పటికీ మొత్తానికి అధికారికంగా ఒక వీడియోను విడుదల చేస్తూ క్లారిటీ చేశారు.

పవర్ఫుల్ పాత్రలో

ఈ సినిమాలో ఫస్ట్ హాప్ లో నేషనల్ లెవెల్ బాక్సింగ్ క్లియర్ గా కనిపించనున్న విజయ్ దేవరకొండ సెకండాఫ్ హాఫ్ లో ఇంటర్నేషనల్ బాక్సర్ గా కనిపిస్తాడట. ఇక ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు అతి భయంకరమైన బాక్సర్ గా గుర్తింపు అందుకున్నటువంటి మైక్ టైసన్ మొదటిసారి వెండి తెరపై కనిపించబోతున్నాడు. ఒక పవర్ఫుల్ పాత్ర కోసం దర్శకుడు పూరి జగన్నాథ్ అతన్ని సంప్రదించగా అడిగిన వెంటనే మైక్ టైసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

మతిపోయేలా..

మతిపోయేలా..

మైక్ టైసన్ ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు అంటే తప్పకుండా సినిమాలు బలమైన పాయింట్ ఉందని అర్థమవుతోంది. ఇక విజయ్ దేవరకొండ టైసన్ కు సంబంధించిన వీడియోని విడుదల చేస్తూ తప్పకుండా మతిపోయేలా ఈ సినిమా ఉంటుందని తెలిపాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అంటూ భారతీయ స్క్రీన్‌లపై మొదటిసారి
ది బడ్డెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్.. బాక్సింగ్ యొక్క దేవుడు
ది లెజెండ్, ది బీస్ట్, ఆల్ ది గ్రేటెస్ట్.. ఐరన్ మైక్ టైసన్ కనిపించబోతున్నాడు అని పేర్కొన్నారు. నమస్తే టైసన్ అనే ట్యాగ్ ను కూడా హైలెట్ చేశారు.

సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా..

సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా..

చూస్తుంటే ఈ సినిమా తో విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఇండియన్ మార్కెట్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయనున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది ఇక ఇప్పుడు మైక్ టైసన్ కు సంబంధించిన అఫీషియల్ వీడియో కూడా వైరల్ గా మారడంతో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ మొదటి సారి భారీ స్థాయిలో డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ కాబట్టి అంతకుమించి అనేలా ఉంటుందని అనిపిస్తోంది. ఇక బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ సినిమాకి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

వర్మ పాజిటివ్ కామెంట్స్

మైక్ టైసన్ అప్డేట్ ఇవ్వగానే పాన్ ఇండియా సినిమా లైగర్ కు విషెస్ అందిస్తూ రామ్ గోపాల్ వర్మ కూడా స్పంధించారు. పూరి జగన్నాథ్ ఛార్మి కరణ్ జోహార్ అందరికి కంగ్రాట్స్ అంటూ.. పాన్ ఇండియా ఫిల్మ్ లైగర్ కోసం విజయ్ దేవరకొండ తో మైక్ టైసన్ జాయిన్ అవ్వడం చాలా పెద్ద విషయం అంటూ అందరిపై పాజిటివ్ గా కామెంట్ చేశారు. వర్మకి కూడా మైక్ టైసన్ అంటే ఎంతో అభిమానం. మరి లైగర్ షూటింగ్ కు వస్తే ఆయనను కలుస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X