Double Ismart: పూరీ జగన్నాథ్‌పై బీఆర్ఎస్ నేత కేసు.. మార్ ముంతా పాటలో వివాదాస్పదంగా కేసీఆర్ డైలాగ్!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇబ్బందుల్లో పడ్డాడు. ఆయన రూపొందిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని మార్ ముంత చోడ్ చింత పాటలో కేసీఆర్ డైలాగ్‌ను ఉపయోగించుకోవడంపై బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కేసీఆర్ అభిమానులు భగ్గుమంటున్నారు. తెలంగాణ సాధించిన నేతను కించపరిచేలా ఈ పాట ఉందని బీఆర్ఎస్ నాయకురాలు కేసు నమోదు చేశారు. ఈ వివాదంలోకి వెళితే..

తాజాగా డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని రామ్ పోతినేని, కావ్య థాపర్‌పై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ మార్ ముంత..చోడ్ చింత పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్ వచ్చాయి. మంచి జోష్‌తో సాగే పాటలో కేసీఆర్ డైలాగ్ మరింత ఉత్సాహాన్ని పెట్టించింది.

BRS Leader filed a case on Puri Jagannadh amid usage of KCR Dialogue in Double Ismart Song in Controversial Manner

అయితే కల్లు, మద్యం నేపథ్యంగా సాగే పాటలో అయితే ఏం చెద్దాం అని కేసీఆర్ ట్రేడ్ మార్క్ డైలాగ్‌ను ఉపయోగించారు. అయితే ఆ డైలాగ్‌ను ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ..ఎల్బీ నగర్‌లో డీఎస్పీకి ఫిర్యాదు. చేశారు. కేసీఆర్‌ను కించపరిచేలా చేసిన పూరీ జగన్నాథ్‌పై చర్యలు తీసుకోవాలి అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎం రజితారెడ్డి అనే నేత ఫిర్యాదు చేసిన ప్రకారం.. పూరీ జగన్నాథ్ గారు నిర్మించిన డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాలోని ఐటెమ్ సాంగ్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డైలాగ్‌ను వాళ్ల పాటలో హుక్‌లైన్‌గా వాడటం జరిగింది. ఇది చాలా అబ్యంతరకమైన విషయం అని ఆమె పేర్కొన్నారు.

BRS Leader filed a case on Puri Jagannadh amid usage of KCR Dialogue in Double Ismart Song in Controversial Manner

అంతేకాకుండా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉంది. మా ప్రాంత యాస, భాషను కించపరిచే విధంగా ఉంది. మా బీఆర్ఎస్ అధినాయకుడిని కించపరిస్తే ఊరుకొనేది లేదని తెలియజేస్తున్నాం. ఆ డైలాగ్‌ను సాంగ్ నుంచి తొలగించాలని కోరుతున్నాం అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

More from Filmibeat

Read more about: puri jagannadh kcr double ismart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X