ఆమెతో పోల్చుతూ.. పదహారేళ్ల బంధం అంటూ చార్మీ పోస్ట్.. వైరలవుతోన్న పిక్
అందం అమాయకత్వం అన్ని కలగలపి ఉన్న హీరోయిన్ చార్మీ. ఒకప్పుడు ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోయిన ఈ హీరోయిన్ ప్రస్తుతం నటనను పక్కన పెట్టేసింది. నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేస్తూ సక్సెస్ సాధిస్తోంది.

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో..
కామెడీ అయినా, ఎమోషనల్ అయినా ఎలాంటి సీన్స్‌లో అయినా అవలీలగా నటిస్తుంది. డ్యాన్సుల్లో తనదైన శైలిలో దూసుకుపోయేది. అంచెలంచెలుగా ఎదిగి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. అనుకోకుండా ఒక రోజు, మంత్ర, జ్యోతి లక్ష్మీ లాంటి సినిమాలతో అందర్నీ అలరించింది.

నిర్మాణరంగంలోకి..
చివరకు పూరి జగన్నాథ్‌తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో నిర్మించి సినిమా బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది.తాజాగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్టు కొట్టిన వీరు.. ఫుల్ జోష్‌లో తదుపరి ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నారు.

పదహారేళ్ల బంధం..
తాజాగా చార్మీ ఓ పోస్ట్ చేసింది. హాలీవుడ్ ప్రముఖ నటి మెర్లీ స్ట్రీప్‌తో పోలుస్తూ.. తమది పదహారేళ్ల బంధమంటూ రమ్యకృష్ణతో దిగిన ఓ పిక్‌ను పోస్ట్ చేసింది. శ్రీ ఆంజనేయం సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది కృష్ణవంశీ కావడంతో వారి స్నేహబంధం మరింత బలపడింది. శనివారం రాత్రి తనను కలిసినట్టు తెలిపింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజమాతగా పాపులర్..
అత్యధికంగా ఆస్కార్‌కు నామినేట్ అయిన మెర్లీ స్ట్రీప్.. తన ప్రత్యేకమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. రమ్యకృష్ణ కూడా తనదైన శైలి నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని రాజమాతగా పేర్గాంచింది.


Click it and Unblock the Notifications











