వరంగల్‌లో ఈవెంట్ చేస్తే సూపర్‌హిట్.. లైగర్ బ్లాక్‌బస్టరే.. ఛార్మీ ఎమోషనల్ స్పీచ్
పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం లైగర్. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వరంగల్‌లోని కాజీపేటకు సమీపంలోని మడికొండలో ఉన్న సత్యసాయి కన్వెన్షన్‌లో ఫ్యాన్‌డమ్ టూర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్మాత ఛార్మీ మాట్లాడుతూ..

వరంగల్ కుర్రాళ్లంటే మామూలుగా ఉండరు. వరంగల్ సిటీ అంటే నాకు సెంటిమెంట్. ఏదైనా సినిమా ప్రమోషన్ చేయాలంటే ఫస్ట్ వరంగల్‌నే టిక్ చేస్తాను. వరంగల్‌లో ఈవెంట్ చేస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది అని చార్మీ ఎమోషనల్‌గా మాట్లాడారు.
వాస్తవానికి ఆర్ట్స్ కాలేజిలో లైగర్ ఫ్యాన్‌డమ్ టూర్ ఈవెంట్ జరగాల్సింది. వర్షాలు కారణంగా చివరి నిమిషంలో రద్దైంది. దాంతో ఈ వేదికను కాజీపేటకు సమీపంలోని మణికొండలో ఉన్న సత్యసాయి కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. చివరి నిమిషంలో వేదిక మారినప్పటికీ.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చోరవ, సహాయంతో మూడు గంటల్లోనే వేదికను అద్బుతంగా తయారు చేశారు. అందుకు మంత్రికి, శ్రేయాస్ మీడియాకు ధన్యవాదాలు చెబుతున్నాను అని చార్మీ అన్నారు.
లైగర్ సినిమా ఆగస్టు 25వ రోజున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఆ రోజున విజయ్ దేవరకొండ వాట్ లాగా దేంగే అని ఛార్మీ అన్నారు. ఈ సినిమా గురించి చాలా మాట్లాడాలని ఉంది. కానీ బాక్సాఫీస్ అదిరిపోయే విధంగా కలెక్షన్ల వచ్చిన తర్వాత నేను చాలా మాట్లాడుతాను అని చార్మీ అన్నారు.


Click it and Unblock the Notifications











