గర్వపడేలా ఉంటాను..ఎంతో సంతోష పరిచావు: పూరి కోసం చార్మీ, విజయ్ స్పెషల్ విషెస్
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ కి హీరోల రేంజ్ లో ఆభిమానులు కూడా ఉన్నారు. దాదాపు అందరి హీరోలతో వర్క్ చేసిన అనుభవం ఉండడంతో ప్రతి హీరో అభిమాని పూరిని అమితంగా ఇష్టపడతారు. ఇక నేడు ఈ సీనియర్ దర్శకుడి 54వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో విషెస్ అందిస్తున్నారు. అందులో కొందరు స్టార్స్ చాలా స్పెషల్ గా అందించిన విషెస్ వైరల్ అవుతున్నాయి.

పూరి జగన్నాథ్ టీమ్ తో కలిసి..
ముఖ్యంగా ఛార్మీ కౌర్ అందించిన విషెస్ గురించి ఎవరైనా సరే ఒక లుక్ వేయకుండా ఉండలేరు. హీరోయిన్ గా చాలా ఏళ్ళు తన అదృష్టాన్ని పరిక్షించుకున్న చార్మీ చివరికి ఒక లైన్ ప్రొడ్యూసర్ నుంచి సహా నిర్మాత వరకు వచ్చేసింది. పూరి జగన్నాథ్ టీమ్ తో కలిసి ఆమె గత కొన్నేళ్లుగా వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి సారి వీరి కలయికలో జ్యోతి లక్ష్మి సినిమా వచ్చింది. కానీ ఆ సినిమా పెద్దగా క్లిక్కవ్వలేదు.

డిజాస్టర్స్ ఎదురైనప్పుటికీ
ఇక హీరోయిన్ గా క్లిక్కవ్వడం లేదని సినిమాలకు ఎండ్ కార్డ్ పెట్టిన ఛార్మీ పూరి జగన్నాథ్ ని పాట్నర్ గా సినిమాలను నిర్మిస్తూ తనదైన శైలిలో లాభాలను అందుకుంటోంది. మొదట్లో కాస్త డిజాస్టర్స్ ఎదురైనప్పుటికీ వీరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ మాత్రం బ్రేక్ అవ్వలేదు. ఇక రూమర్స్ ఎన్ని వచ్చినా కిడా లెక్క చేయలేదు. చార్మీ కూడా పూరి జగన్నాథ్ కి ఎల్లప్పుడూ సపోర్టింగ్ గా ఉంటూ సినిమాల కోసం బాగానే కష్టపడింది.

నువ్వు గర్వపడేలా ఉంటాను
ఇక పూరి జగన్నాధ్ బర్త్ డే సందర్భంగా ఆమె ఈ విధంగా విషెస్ అందించింది. ఎన్నో మిలియన్ల హృదయాలను గెలుచుకున్న పూరి అంటే నా గార్డియన్, బెస్ట్ ఫ్రెండ్, మోస్ట్ కేరింగ్ పర్సన్ అలాగే బెస్ట్ బిజినెస్ పార్టనర్ అని వివరణ ఇచ్చిన చార్మి.. అతడికి హృదయపూర్వక శుభాకాంక్షలు అందించింది. అదే విధంగా పూరికి ఒక వాగ్దానం చేస్తూ.. నిరంతరం నువ్వు గర్వపడేలా ఉంటానని తన ట్విట్టర్ లో పేర్కొంది.
Recommended Video

విజయ్ దేవరకొండ స్పెషల్ బర్త్ డే విషెస్
పూరి జగన్నాథ్ సర్.. మీకు హృదయపూర్వకంగా హ్యాపీ బర్త్ డే విషెస్ అందిస్తున్నాను. మీరు నన్ను ఎంతగానో సంతోషపరుస్తున్నారు. నా పోరాటాలతో సంతోషంగా ఉన్నాను. నటుడిగా కూడా సంతోషంగా ఉన్నాను. అలాగే ఒక పర్సన్ గా కూడా. ఈ ప్రత్యేకమైన సినిమా మన ఇద్దరిని దగ్గర చేసింది. కానీ నేను మిమ్మల్ని నా హృదయానికి ఎల్లప్పుడూ సినిమాకు మించి దగ్గరగా ఉంచుతాను.. అని విజయ్ దేవరకొండ తన విషెస్ ని అందించాడు.


Click it and Unblock the Notifications











