మాల్దీవుల్లో ముగించాం.. ఇక పూరితో కలిసి హైదరాబాద్ వచ్చేస్తా: ఛార్మి
సినిమాల్లో నటించడం మానుకున్నాక నిర్మాతగా సత్తా చాటుతోంది ఛార్మి. పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించిన ఆమె.. ఈ బ్యానర్ బాధ్యతలు పూర్తిగా మోస్తోంది. అన్నీ తానై చూసుకుంటూ వరుస సినిమాలు నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి నిర్మిస్తున్న తాజా సినిమా ఇస్మార్ట్ శంకర్.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ చిందులేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ ఈ సినిమాలో రొమాంటిక్ డోస్ ఎలా ఉంటుందో తెలియజేశాయి. ప్రస్తుతం మాల్దీవ్స్ లోని అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరో రెండు పాటల షూటింగ్ పెండింగ్‌లో ఉంది. ఈ మేరకు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది ఛార్మి.

హీరో రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి దిగిన పిక్‌ని ట్విట్టర్‌లో షేర్ చేసిన ఛార్మి.. ''మాల్దీవుల్లో ఫినిష్ చేశాం.. ఇక మిగిలిన రెండు పాటలను హైదరాబాద్ లోని అందమైన లొకేషన్స్ లో షూట్ చేస్తాం'' అని ప్రకటించింది. ఈ రెండు పాటలతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తికానుందని సమాచారం. ఇస్మార్ట్ శంకర్ సినిమా షూటింగ్ జరుపుతూనే ప్రమోషన్స్ చేయడంలో సక్సెస్ అయ్యారు పూరి అండ్ ఛార్మి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన దిమాక్ ఖరాబ్, జిందాబాద్ జిందాబాద్ పాటలు ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేశాయి.
'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు ''డబుల్ దిమాక్'' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో ఛార్మి, పూరి జగన్నాథ్ నిర్మాణంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వహిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ జులై 12వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











