ఎంజాయ్ చేసేద్దాం.. ఆఫర్ చేసిన ఛార్మి.. ఆగలేక పోతున్నానంటూ జగన్!

Recommended Video

Puri Jagannadh-Charmy Kaur Tweets On Ram Pothineni Goes Viral || Filmibeat Telugu

టెంపర్ సినిమా తర్వాత విజయం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ రూపంలో సక్సెస్ సాధించాడు. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా పూరి జగన్నాథ్ కెరీర్ లో మరో హిట్ సినిమాగా పేరు లిఖించుకుంది. భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా హిట్ ఇచ్చిన జోష్‌లో పూరి జగన్నాథ్, ఛార్మి ఫుల్లుగా ఖుషీ అవుతున్నారు. అయితే తాజాగా పూరిని ట్యాగ్ చేస్తూ ఛార్మి చేసిన ట్వీట్, దానిపై పూరి రెస్పాన్స్ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారాయి. ఇంతకీ ఛార్మి చేసిన ట్వీట్‌లో ఏముంది? వివరాల్లోకి పోతే..

ఖుషీ ఖుషీగా ఇస్మార్ట్ టీమ్

ఖుషీ ఖుషీగా ఇస్మార్ట్ టీమ్

విడుదలైన తొలి రోజే ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ టాక్ తెరుచుకొని ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. దీంతో ఖుషీ ఖుషీగా ఉన్న ఇస్మార్ట్ టీమ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రేక్షకులను పలకరిస్తోంది. ఈ సక్సెస్ టూర్‌లో పూరి జగన్నాథ్, ఛార్మి సహా హీరోయిన్ నిధి అగర్వాల్ పాల్గొంటూ ఆడియన్స్‌లో జోష్ నింపుతోంది.

విదేశాల్లో హీరో రామ్

విదేశాల్లో హీరో రామ్

నిజానికి పూరి జగన్నాథ్‌తో సహా హీరో రామ్‌కి కూడా ఇస్మార్ట్ శంకర్ విజయం ఎంతో కీలకం. ఆయన కెరీర్ లో ఇది టర్నింగ్ మూవీ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సక్సెస్ టూర్‌లో రామ్ కూడా పాల్గొని మాస్ ఆడియన్స్‌ చేత కేకలు పెట్టించాల్సింది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆయన విదేశాలకు వెళ్లడం కారణంగా ఇస్నార్ట్ టూర్‌లో భాగం కాలేక పోయాడు హీరో రామ్.

రామ్ నుంచి క్లారిటీ.. ఛార్మి ట్వీట్

మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌లో అడుగుపెట్టబోతున్నట్లుగా హీరో రామ్ నుంచి క్లారిటీ వచ్చేసింది. దీంతో ఇస్మార్ట్ రామ్‌తో కలసి మరోసారి ఎంజాయ్ చేద్దాం అంటూ పూరీ జగన్నాథ్‌కు ఛార్మి కౌర్ ట్విట్టర్‌లో ఆఫర్ చేసింది. అంటే ఇన్నాళ్లు నిధితో కలిసి సక్సెస్ ఎంజాయ్ చేశాం.. ఇక రామ్ కూడా మనకు తోడు కాబోతున్నాడు.. ఫుల్లుగా ఎంజాయ్ చేసేద్దాం అని పేర్కొంది ఛార్మి.

వెంటనే జగన్ స్పందిస్తూ

ఇస్మార్ట్ విజయం తర్వాత ఛార్మితో పాటు పూరి జగన్నాథ్ కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యారు. ఛార్మి చేసిన ట్వీట్ చూసి వెంటనే స్పందించిన ఆయన.. ''అలాగే.. ఈ బ్లాక్ బస్టర్ ఫుల్లుగా ఎంజాయ్ చేసేద్దాం.. ఆగలేక పోతున్నా'' అని రిప్లై ఇచ్చాడు. ఈ ఇద్దరి మధ్య నడిచిన ఈ సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఇస్మార్ట్ శంకర్ మూవీ

ఇస్మార్ట్ శంకర్ మూవీ

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమాను పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి తెరకెక్కించారు. చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించగా.. అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. నిధి, నభా గ్లామర్ డోస్ తెలుగు ప్రేక్షకుల దిమాక్ ఖరాబ్ చేస్తోంది. పూరి జగన్నాథ్ సహా హీరో రామ్, హీరోయిన్లు నిధి, నభా ఇద్దరికీ ఈ విజయం టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X