బాలయ్యను బాగా మిస్ అవుతున్నా.. ఛార్మి సెన్సేషనల్ పోస్ట్

నేడు (జూన్ 10) నందమూరి నటసింహం బాలకృష్ణ 59వ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్, నిర్మాత ఛార్మి చాలా ఆసక్తికరంగా బాలయ్య బాబుకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు బాలయ్యతో కలిసి కేక్ కట్ చేస్తున్న పిక్ షేర్ చేసింది ఛార్మి. దీనిపై బాలయ్యను బాగా మిస్సవుతున్నా అని ట్యాగ్ చేయడం నెటిజన్లను ఆలోచనలో పడేసింది.

బాలకృష్ణతో కలిసి 'పైసా వసూల్' సినిమా చేసింది ఛార్మి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు నిర్మాణం పరంగా అన్ని బాధ్యతలు ఛార్మినే తీసుకుంది. ఆ సమయంలో బాలయ్య బాబుతో ఛార్మి ఫ్రెండ్‌షిప్ పీక్స్ లోకి వెళ్ళింది. ఆ సినిమా తర్వాత బాలయ్య, ఛార్మి ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే బాలయ్యను మిస్ అవుతునాన్ని ఛార్మి ఫీలై పోతోందని కామెంట్స్ వస్తున్నాయి. అలాగే ఛార్మింగ్ బ్యూటీతో సరదాగా బాలయ్య కేక్ కట్ చేస్తున్న దృశ్యం నందమూరి అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

Charmy Kaur wishes to Nandamuri Balakrishna

ప్రస్తుతం ఛార్మి ఇస్మార్ట్ శంకర్ సినిమా రూపొందించే పనిలో ఉంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై ఛార్మి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తుండగా, అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ ఆయన సరసన చిందులేస్తున్నారు. జులై 12 న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఇక బాలకృష్ణ బర్త్ డే సందర్బంగా ఆయన తదుపరి సినిమా టైటిల్ ప్రకటిస్తారని భావించిన నందమూరి అభిమానులకు నిరీశే మిగిలింది. కేవలం బాలకృష్ణ 105 సినిమా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఉండనుందని, దీనికి బడా నిర్మాత సి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారనే కన్ఫర్మేషన్ తప్ప ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలు ఏవీ ప్రకటించలేదు. ద‌ర్శ‌కుడు కేఎస్ ర‌వికుమార్‌, నిర్మాత సి.క‌ల్యాణ్ బాల‌య్య‌ను క‌లిసి పుష్పగుచ్చం అందించి జ‌న్మ‌దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X