ఆటో డ్రైవర్ కథ పక్కన పడేశా అంటూ పూరీ జగన్నాథ్.. గాడ్‌ఫాదర్‌‌లో నీకు ఆఫర్ ఇచ్చా.. నాకు అవకాశం ఇస్తావా? చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమా విజయవంతంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో విభిన్నమైన రీతిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 100 గ్రాస్ వసూళ్లతో కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తున్నది. ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించిన పూరీ జగన్నాథ్‌తో ఇన్స్‌టాగ్రామ్, యూట్యూబ్‌లో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పూరీ, చిరంజీవి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ మీ కోసం..

రిలీజ్‌కు ముందే పాజిటివ్‌గా

రిలీజ్‌కు ముందే పాజిటివ్‌గా


గాడ్‌ఫాదర్ చిత్రానికి రిలీజ్‌కు ముందే పాజిటివ్ వైబ్స్ కనిపించాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడటం వలనో. లేదా పోస్టర్లు, టీజర్ల కారణంగానే సినిమా హిట్ అనే విషయాన్ని ప్రేక్షకులు తేల్చాశారు. వారికి సక్సెస్‌ను ముందే పసిగట్టడం తెలుసు అని చిరంజీవి అంటే.. మనకు ఆ శక్తి ఉంటే.. మంచి సినిమాలు తీసే అవకాశం దక్కుతుందని పూరీ అన్నాడు.

వరుస ప్రాజెక్టులు ఎలా సాధ్యం

వరుస ప్రాజెక్టులు ఎలా సాధ్యం


టాలీవుడ్‌లో ఏ హీరో చేయని విధంగా మీరు చాలా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు అని పూరీ జగన్నాథ్ అంటే.. అలా కుదిరిపోయింది అని చిరంజీవి జవాబిచ్చారు. ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తూనే నేను బాబీ దర్శకత్వంలో షూటింగులో పాల్గొంటున్నాను. ఈ సినిమాపై వచ్చే ఫీడ్ బ్యాక్‌ను ఆస్వాదిస్తున్నాను అని చిరంజీవి చెప్పారు.

రెండు రోజులు నిద్ర లేకుండా షూట్

రెండు రోజులు నిద్ర లేకుండా షూట్


అయితే ఇంత బిజీగా ఒక సినిమా వెంటనే ఒక సినిమా ఎలా చేస్తున్నారు అని పూరీ అంటే.. . గాడ్‌ఫాదర్ సినిమా షూట్ ముంబైలో అర్ధరాత్రి వరకు చేసి.. మళ్లీ ఉదయమే బాబీ మూవీ షూట్‌లో పాల్గొన్నాను. అప్పటికే రెండు రోజులుగా నిద్ర లేకపోవడంతో కళ్లు ఎరుపు ఎక్కాయి. అదే సమయంలో షూటింగ్ ఎక్స్‌టెండ్ చేశారు. అయినా షూటింగ్ చేస్తుండటంతో.. నిద్ర పోలేదని విషయం వారికి తెలిసింది. అయినా నేను ఆ షూటింగ్‌ను కంప్లీట్ చేశాను. పని చేస్తుంటే వచ్చే కిక్క్ ముందు అలసట ఉండదు అని చిరంజీవి అన్నారు.

నిన్ను ఎందుకు తీసుకొన్నామంటే?

నిన్ను ఎందుకు తీసుకొన్నామంటే?


గాడ్‌ఫాదర్ చిత్రంలో యూట్యూబర్ పాత్రకు చాలా మందిని అనుకొన్నాం. కానీ నీ ప్రాడ్ కాస్ట్ చూసిన తర్వాత ఆ పాత్రకు నీవైతే బాగుంటుందని దర్శకుడు మోహన్ రాజాతో చెప్పాను. అయితే ఆయన చేస్తారా అని సందేహం వ్యక్తం చేశారు. అయితే నేను స్వయంగా ఫోన్ తీసుకొని.. నీతో మాట్లాడి ఎలాగోలా ఒప్పించాను. కొన్ని సీన్లను చాలా ఇంప్రూవ్ చేశాం అని చిరంజీవి అంటే.. ఒక సీన్‌లో చేతులెత్తి మొక్కే సీన్‌లో మీరు తక్కువ చేసుకొని నటించారు అని పూరీ అన్నారు.

ఆటో జానీ స్క్రిప్టు ఏం చేశావు? అంటూ చిరంజీవి

ఆటో జానీ స్క్రిప్టు ఏం చేశావు? అంటూ చిరంజీవి


పూరీ జగన్నాథ్‌తో లైవ్ చాటింగ్ ముగింపులో చిరంజీవి మెల్లగా తనదైన శైలిలో.. నా ఆటో జానీ సినిమా కథను ఏం చేశావు? చించి బయపడేశావా? అని అని అడిగాడు. అయితే ఆటోజానీ కథను పక్కన పడేశాను. అది చాలా పాత కథ.. మళ్లీ మీ వద్దకు మంచి కథతో వస్తాను అని పూరీ జగన్నాథ్ అన్నాడు. అయితే గాడ్‌ఫాదర్‌లో మీకు ఆఫర్ ఇచ్చాను. మీరు నాకు ఒక అవకాశం ఇవ్వాలి అని చిరంజీవి అంటే.. పూరీ వెంటనే చేతులెత్తి మొక్కాడు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను అని పూరీ చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X