అఖిల్ పెర్ఫార్మెన్స్ అదుర్స్.. కంగ్రాట్స్ నాగార్జున.. లెనిన్‌పై చిరంజీవి ప్రశంసలు

అఖిలో అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కించిన మూవీ లెనిన్. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, విలేజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 10న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణను దక్కించుకోవడంతో పాటు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 61 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అనిపించుకుని 100 కోట్ల రూపాయల మార్క్ దిశగా పరుగులు తీస్తోంది. ఏజెంట్ వంటి డిజాస్టర్ తర్వాత సాలీడ్ హిట్‌తో అఖిల్ గట్టి కమ్ బ్యాక్ ఇచ్చాడు అఖిల్.

Also Read
Lenin Overseas Collection: అమెరికాలో లెనిన్ వసూళ్ల జాతర.. అఖిల్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Lenin Overseas Collection: అమెరికాలో లెనిన్ వసూళ్ల జాతర.. అఖిల్ మూవీకి ఎన్ని కోట్లంటే?

కలెక్షన్ల విషయాన్ని పక్కనపెడితే.. లెనిన్ ద్వారా అఖిల్ నటుడిగా ఓ మెట్టు పైకెక్కాడని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాలో అఖిల్ నటన, ఎక్స్‌ప్రెషన్స్ గురించి ప్రతిఒక్కరూ ప్రశంసిస్తున్నారు. లెనిన్‌లో అఖిల్ నటనకు సంబంధించిన క్లిప్స్‌ను అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇది ఆయన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ప్రతిఒక్కరూ ఒప్పుకుంటున్నారు. ఇన్నేళ్లకు అఖిల్ సరైన ట్రాక్‌లోకి వచ్చాడని.. దీనిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్లాన్ చేసుకుంటే ఆయన తిరుగులేని నటుడిగా నిలబడతాడని ప్రశంసిస్తున్నారు.

Chiranjeevi Praises Akhil Akkineni s performance in Lenin Nagarjuna s Heartfelt Reply Wins Fans Over

సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా అఖిల్ నటనను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. లెనిన్ గురించి అద్భుతమైన స్పందనలు రావడం వింటున్నాను, అఖిల్ నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు రావడం సంతోషంగా ఉంది. అఖిల్ నాకు మరో కుమారుడి లాంటివాడు. ప్రతి సినిమాతో ఆయన నటుడిగా ఎదుగుతున్న తీరు సంతోషంగా ఉంది. నా మిత్రుడు నాగార్జున గారికి, లెనిన్ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు నా హృదయ పూర్వక అభినందనలు. లెనిన్ సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా మరింత విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు.

ఈ పోస్ట్‌పై అఖిల్ తండ్రి, హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. థ్యాంక్యూ చిరంజీవిగారు, మీరు నాకు నా కుటుంబానికి ఓ మూలస్తంభంలా అండగా నిలుస్తున్నారు. లెనిన్‌ని వీక్షించండి, ఈ సినిమా మీకు నచ్చుతుందని మాటిస్తున్నానని నాగ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నాగార్జున, చిరంజీవి స్నేహ బంధంపై అభిమానులు మురిసిపోతున్నారు.

ఇదిలాఉండగా.. తండ్రులే కాదు వారి కొడుకులు కూడా మధ్య కూడా అదే అనుబంధం కొనసాగుతోంది. నాగచైతన్య- రామ్ చరణ్, అఖిల్- రామ్ చరణ్‌లు మంచి మిత్రులు అన్న సంగతి తెలిసిందే. ఇటీవల లెనిన్ ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ రామ్ చరణ్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇండస్ట్రీలో నాకు చాలా తక్కువ మంది స్నేహితులు. నితిన్ తొలి నుంచి బెస్ట్ ఫ్రెండ్.. నా తొలి సినిమా కూడా తనే నిర్మించారు. రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య.. అర్ధరాత్రి అయినా సరే ఫోన్ చేసేంత క్లోజ్ అని చరణ్‌తో తన ఫ్రెండ్‌షిప్‌ను బయటపెట్టారు. అలాగే పెద్ది సినిమా సక్సెస్ పైనా అఖిల్ స్వయంగా కంగ్రాట్స్ చెప్పారు.

Read more about: chiranjeevi akhil akkineni lenin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X