Lenin Overseas Collection: అమెరికాలో లెనిన్ వసూళ్ల జాతర.. అఖిల్ మూవీకి ఎన్ని కోట్లంటే?
మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన మూవీ లెనిన్. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. జూలై 10న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రిలీజైంది. తొలిరోజు నుంచి వసూళ్ల విషయంలో సత్తా చాటుతున్నాడు లెనిన్. ఈ క్రమంలో ఈ సినిమాకు ఓవర్సీస్‌లో ఎలాంటి కలెక్షన్స్ వస్తున్నాయి? ఇప్పటి వరకు వచ్చింది ఎంత? అనేది పరిశీలిస్తే..
లెనిన్ బడ్జెట్
లెనిన్ మూవీని 55 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించగా.. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా 20 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. లెనిన్ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 22 కోట్ల రూపాయల షేర్.. 44 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు బ్రేక్ఈవెన్ వాల్యూ నిర్దేశించారు.

లెనిన్ మూడు రోజుల కలెక్షన్స్
అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ మూవీ ఇండియాలో తొలిరోజున 7.15 కోట్ల రూపాయలు, రెండో రోజున 8.65 కోట్ల రూపాయలు, మూడో రోజున 9.65 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిక్ నివేదించింది. తద్వారా భారత్‌లో ఇప్పటి వరకు 25.45 కోట్ల రూపాయల నెట్.. 29.27 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా పేర్కొంది. తొలిరోజును మించి రెండో రోజు.. రెండో రోజును మించి మూడో రోజు అన్నట్లుగా వసూళ్ల వర్షం కురిపించాడు లెనిన్. ఫస్ట్ వీకెండ్‌లో ఏకంగా 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటాలు అఖిల్. తొలి రోజుల్లో ఇండియా వైడ్ 8572 షోలు ప్రదర్శితమవ్వగా.. 16 లక్షల 11 వేల 253 టికెట్లు అమ్ముడైనట్లు ట్రాక్ టాలీవుడ్ పేర్కొంది.
లెనిన్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఓవర్సీస్‌లో అఖిల్ అక్కినేని నిలకడగా రాణిస్తున్నాడు. ప్రీమియర్స్+ డే 1 కలెక్షన్స్ కలిపి నార్త్ అమెరికాలోని 213 సెంటర్లలో 286,518 డాలర్లు (2.74 కోట్ల రూపాయలు) వచ్చింది. రెండో రోజున 182 కేంద్రాలలో 129 డాలర్లు (1.23 కోట్ల రూపాయలు) వసూలు అయ్యింది. మూడో రోజైన ఆదివారం నార్త్ అమెరికాలో 176 కేంద్రాలలో 88K డాలర్లు (84.22 లక్షల రూపాయలు) వసూలు చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మూడు రోజుల వరకు ఒక్క అమెరికాలోనే లెనిన్ మూవీ 500K డాలర్లు (4.78 కోట్ల రూపాయలు) రాబట్టినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీనికి నార్త్ అమెరికా వసూళ్లు కూడా కలిపితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, యూకే తదితర దేశాలలో కలిపి లెనిన్‌కు ఓవర్సీస్‌లో 7.80 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా సాక్‌నిక్ పేర్కొంది. భారత్‌లో వచ్చిన వసూళ్లతో కలిపి అఖిల్ మూవీ మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 37 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు నివేదించింది. అయితే తమ చిత్రం రెండ్రోజుల్లోనే 37 కోట్ల రూపాయలు రాబట్టినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఆదివారం తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్‌లో స్ట్రాంగ్ హోల్డ్ చూపించినట్లుగా రిపోర్ట్ రావడంతో లెనిన్ వరల్డ్ వైడ్‌గా 50 కోట్ల మార్క్‌ని క్రాస్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అయితే సోమవారం నుంచి లెనిన్‌కు అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. వర్కింగ్ డేస్ మొదలు కానుండటంతో మండే టెస్ట్‌ని అఖిల్ ఎలా ఎదుర్కొంటాడన్నది ఆసక్తిగా మారింది. ఈ టెస్ట్‌లో పాసైతే లెనిన్ గట్టెక్కినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరి అక్కినేని వారసుడు ఎంత వరకు నిలబడతాడో చూడాలి.


Click it and Unblock the Notifications



