Don't Miss!
- News
బండి సంజయ్ నియోజకవర్గం ఖరారు?
- Sports
IND vs NZ మూడో టీ20లో పృథ్వీ షాను ఖచ్చితంగా ఆడించాలి! ఎందుకంటే..?
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Lifestyle
Garuda Purana: ఈ పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలి.. లేదంటే సమస్యలు తప్పవు
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Technology
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
వరుసబెట్టి అందరి లెక్కలు సరి చేస్తున్న మెగాస్టార్.. మోహన్ బాబుపై అదిరిపోయే పంచ్
మెగాస్టార్ చిరంజీవ దూకుడు చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఉగాదికి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి.. ఒక్కరోజులోనే గాడిలో పడ్డాడు. అందరికి అదిరిపోయే రిప్లైలు ఇస్తూ.. ఆశ్చర్యపరుస్తున్నాడు. సోషల్ మీడియా ప్రపంచంలోకి చిరంజీవికి ఘన స్వాగతమంటూ అందరూ హోరెత్తించారు. సినీ తారలంతా చిరుకు విషెస్ చెప్పారు.
Recommended Video

వరుసబెట్టి రిప్లైలు..
కాజల్ అగర్వాల్, తమన్నా, సుహాసిని, రాధిక, మోహన్ లాల్, మోహన్ బాబు, పూరీ జగన్నాథ్, కొరటాల శివ, శ్రీకాంత్, దేవీ శ్రీ ప్రసాద్, మోహన్ బాబు, ఎన్టీఆర్ వంటి సెలెబ్రిటీలు అనేకులు చిరుకు స్వాగతం పలికారు. ప్రస్తుతం వీరందరికీ రిప్లై ఇస్తూ తెగ బిజీగా ఉన్నాడు చిరు. వీరందరిలోనూ మోహన్ బాబు, పూరీ జగన్నాథ్ వంటి వారికి ఇచ్చిన ప్రత్యుత్తరాలు అదిరిపోయాయి.

వారంతా సంతోషంగా ఉంటారు..
తనను స్వాగతించినందుకు ధన్యవాదాలు చెబుతూ.. నువ్వు ముంబై బీచ్‌లు, బ్యాంకాక్ లొకేషన్స్ మిస్ అవుతావేమో గానీ, పవిత్ర, ఆకాష్ మాత్రం ఎంతో సంతోషిస్తారు.. నువ్వు ఇంట్లోనే ఉంటూ వారితో సమయాన్ని గడుపుతూ ఉంటే వారు ఆనందంగా ఉంటార'ని ట్వీట్ చేశాడు.

కాజల్, తమన్నా, శ్రీకాంత్‌లకు రిప్లై..
సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చినందుకు తనకు స్వాగతం పలికిన కాజల్, తమన్నా, శ్రీకాంత్ వంటి వారికి రిప్లై ఇచ్చాడు. సైరా సినిమాలోని పాత్రను గుర్తుక చేస్తూ లక్ష్మీ అంటూ తమన్నాను, ఖైదీ నెంబర్ 150 సాంగ్ అమ్మడు అంటూ కాజల్‌కు రిప్లై ఇచ్చాడు.

జూ ఎన్టీఆర్, దేవీలకు రిప్లై..
ఆర్ఆర్ఆర్‌పై చిరు చేసిన ట్వీట్‌కు తారక్ ధన్యవాదాలు తెలుపుతూ.. ట్విట్టర్ ప్రపంచంలోకి స్వాగతం పలికాడు. ఈ ట్వీట్‌కు చిరు రిప్లై ఇస్తూ.. కరోనాపై అవగాహన కలిగించేందుకు మీ ఇద్దరూ కలిసి చేసిన వీడియో ఎంతో బాగుందని, సరైన సమయంలో స్పందించడం బాగుందని కితాబిచ్చాడు. అలాగే దేవీని సైతం మెచ్చుకున్నాడు. కరోనాపై అవగాహన కలిగించేందుకు తన సంగీతాన్ని వాడటం బాగుందని అన్నాడు.

మోహన్ బాబుకు అదిరిపోయే రిప్లై..
సోషల్ మీడియాలోకి చిరు ఎంట్రీని స్వాగతిస్తూ.. మిత్రమా వెల్‌కమ్ అంటూ ట్వీట్ చేశాడు. దానికి ప్రతిగా.. థ్యాంక్యూ మిత్రమా.. రాననుకున్నావా..? రాలేననుకున్నావా? అంటూ అదిరిపోయే పంచ్ వేశాడు. ఇక ఈ రిప్లై చూసిన నెటిజన్స్.. చిరు స్పీడ్‌కు షాక్ అవుతున్నారు.