Tollywood Drugs case : పూరీ జగన్నాధ్, తరుణ్ లకు గుడ్ న్యూస్.. కానీ కొత్త అనుమానాలు?
టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే రెండో దశలో పూరి జగన్నాథ్ మొదలు తనీష్ దాకా చాలా మంది సినీ ప్రముఖులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే తాజాగా పూరి జగన్నాథ్ అలాగే హీరో తరుణ్ విషయంలో కీలక ప్రకటన వెలువడింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

తరుణ్, పూరీలకు క్లీన్ చిట్
2017వ సంవత్సరంలో టాలీవుడ్ మొత్తం మీద సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇద్దరు టాలీవుడ్ ప్రముఖులకు ఊరట లభించినట్లయింది. టాలీవుడ్ హీరో తరుణ్ అలాగే టాలీవుడ్ విలక్షణ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇద్దరికీ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ క్లీన్ చిట్ ఇచ్చింది.. గతంలో పూరీ జగన్నాథ్ సహా మిగతా విచారణకు హాజరైన అందరి దగ్గర నుంచి రక్తం, వెంట్రుకలు, గోళ్ల శాంపిల్స్ సేకరించారు. ఈ శాంపిల్స్ ద్వారా వాళ్ళు డ్రగ్స్ వాడుతున్నారా లేదా అనే అంశం మీద ఫోరెన్సిక్ లాబొరేటరీ లో ఇప్పటిదాకా టెస్టులు జరిగాయి.

ఏమీ దొరకకపోవడంతో
అయితే తాజాగా వెల్లడైన రిపోర్ట్ ప్రకారం పూరి జగన్నాథ్, తరుణ్ నుంచి సేకరించిన రక్తం, వెంట్రుకలు, గోళ్ల శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు అయితే లేవని తేలింది. ఇదే విషయాన్ని తాజాగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ చార్జిషీట్ లో కూడా పేర్కొన్నట్లు సమాచారం. 2017 జూలైలో విచారణ సందర్భంగా పూరి జగన్నాథ్ నుంచి ఎక్సైజ్ శాఖ నమూనాలు సేకరించగా దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యాయి.

అప్పుడే ప్రచారం
నిజానికి 2018 జూలై లో నలుగురు సినీ సెలబ్రిటీలు డ్రగ్స్ వాడుతున్నారనే ఆధారాలు దొరకడం తో పాటు వాళ్ళ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికాయి ప్రచారం జరిగగా ఆ తర్వాత అది నిజం కాదని తేలింది. అయితే తాజాగా ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన చార్జిషీట్లో ఆధారంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు అందరికీ నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తుంది. అయితే ఇప్పుడు అదే చార్జిషీట్లలో ఎక్సైజ్ శాఖ వాళ్లకు ఎలాంటి డ్రగ్స్ వాడిన ఆనవాళ్లు లేవని క్లీన్ చిట్ ఇవ్వడం సంచలనంగా మారింది.

మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి?
అయితే ప్రస్తుతానికి పూరి జగన్నాథ్, తరుణ్ కి సంబంధించిన వివరాలు బయటకు రాగా మిగతా వారి పరిస్థితి ఏమిటి అనే దానిపై ఆసక్తి రేపుతోంది. అప్పట్లో అయితే అందరి దగ్గర నుంచి శాంపిల్స్ సేకరించారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మిగతా వాళ్ల రిపోర్టులు ఎందుకు బయటకు వెల్లడి కాలేదు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

పూరీతో మొదలు పెట్టి
ఇక ఇప్పటికే టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఈడీ దూకుడుగా వ్యవహరించడమే కాక పూరి జగన్నాథ్ తో విచారణ మొదలు పెట్టి చివరిగా తనీష్ ను ప్రశ్నించింది.. కెల్విన్ అనే డ్రగ్ స్పైడర్ అప్రూవర్ గా మారడంతో అతను వీరందరి పేర్లు చెప్పారు అని ప్రచారం జరుగుతోంది.. అందుకే అతని ముందు కూర్చోబెట్టి అధికారులు సినీ ప్రముఖులను విచారిస్తున్నట్లు గా ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











