Suhas: తండ్రి అయిన కలర్ ఫొటో హీరో సుహాస్.. ఎవరు పుట్టారో తెలుసా?
కలర్ ఫొటో హీరో సుహాస్ గురించి అందరికీ తెలిసిందే. చూసేందుకు నల్లగా ఉన్నా హీరో కావచ్చని నిరూపించిన ఈయన.. అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. కలర్ ఫొటో తర్వాత రైటర్ పద్మభూషణ్ సినిమాతో వచ్చి సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత మను చరిత్ర అనే మరో సినిమాతో వచ్చి మెప్పించాడు కుర్ర హీరో. ప్రొఫెషనల్ లైఫ్ లో దూసుకు వెళ్తున్న ఈయన పర్సనల్ లైఫ్ లో కూడా మరో అడుగు ముందుకు వేశారు. తాజాగా ఈయన తండ్రి అయ్యారు. ఆ విషయాన్ని ఆయనే నేరుగా సోషల్ మీడియా వేధికగా తెలిపారు. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.
ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన సుహాస్.. పడి పడి లేచే మనసు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టాడు. ముఖ్యంగా హీరోకు ఫ్రెండ్ క్యారెక్టర్లలో ఇరగ దీస్తూ అతి తక్కువ కాలంనే విశేషమైన ఆదరణ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మజిలీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజూ పండగనే, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, రంగ్ దే, అర్ధ శతాబ్దం, గమనం, ఫ్యామిలీ డ్రామా, హెడ్స్ అండ్ టేల్స్, మిషన్ ఇంపాజిబుల్, హిట్ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాల్లో కనిపించి సందడి చేశాడు.

ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూనే హీరోగా మారిపోయాడు. మొదటి చిత్రంలోనే బ్లాక్ బస్టర్ హిట్టు ఖాతాలో వేసుకుని అద్బుతమైన కథలతో అలరిస్తున్నాడు. ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా బిజీగా ఉండే ఈయన సోషల్ మీడియా వేధికగా చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలతో పాటు.. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను పోస్ట్ చేస్తుంటాడు. అయితే తాజాగా ఈ యంగ్ హీరో ఈ పోస్ట్ చేశాడు. అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.

ఓ బుజ్జి పాపాయిని ఎత్తుకుని మొహం కనిపించకుండా లవ్ ఎమోజీ పెట్టి ఫొటో షేర్ చేశాడు. అయితే ఆయన ఎత్తుకున్న చిన్న బుజ్జాయి తన బేబీనే. ఆయన భార్య లిఖిత తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మను ఇచ్చింది. డెలివరీ తర్వాత దిగిన ఈ ఫొటోను సుహాస్ తన అభిమానులతో పంచుకుంటున్నాడు. తనకు బాబు పుట్టాడని చెప్పుకొచ్చాడు. ఈ ఫొటో చూసిన ప్రతీ ఒక్కరూ ఆయనకు పెద్ద ఎత్తున కంగ్రాట్స్ చెబుతున్నారు. 2017లో సుహాస్. తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన ఏడేళ్లకు వీరు తొలి బిడ్డ పుట్టగా.. సుహాస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











