Liger Fandom Tour వరంగల్‌లో సుమతో ఆలీ డ్యాన్స్ కేక.. చప్పట్ల జోష్‌తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్
పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం లైగర్. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వరంగల్‌లోని కాజీపేటకు సమీపంలోని మడికొండలో ఉన్న సత్యసాయి కన్వెన్షన్‌లో ఫ్యాన్‌డమ్ టూర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

ఆలీ మాట్లాడుతూ.. వరంగల్ కళలకు పుట్టినిల్లు. సినిమా పరిశ్రమకు ఎంతో మంది కళాకారులు వరంగల్ నుంచి వచ్చారు. వరంగల్ నుంచి వచ్చిన కళాకారులు, నటీనటులంటే చాలా ఇష్టం. ఇప్పుడు తెలంగాణ బిడ్డ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ వస్తున్నది. ఈ ట్రైలర్‌తో దేశవ్యాప్తంగా సంచలనాన్ని పూరీ జగన్నాథ్ రేపాడు అని అన్నాడు.

యాంకర్ సుమ వేదికపై ఉండగా.. కొనిస్తనే కోక అనే పాటకు డ్యాన్స్ చేస్తానని చెప్పడంతో వేదిక కింద ఉన్న ప్రముఖులంతా ఆశ్చర్యపోయారు. కొనిస్తనే కోక పాటకు ఆలీ వేసిన స్టెప్పులు కేక పుట్టించాయి. ఆలీతోపాటు సుమ కూడా స్టెప్పులు వేయడంతో స్టేజ్ అంతా దద్దరిల్లింది. ఆలీ డ్యాన్స్ వేస్తున్నంత సేపు ప్రముఖలంతా చప్పట్ల మోత మోగించారు.
డ్యాన్స్ చేసి స్టేజ్ దిగివచ్చిన తర్వాత ఆలీని చార్మీ, పూరీ జగన్నాథ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చప్పట్లతో స్వాగతం పలికి.. గాఢంగా కౌగిలించుకొన్నారు. ప్రస్తుతం ఆలీ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











