Dacoit Day 3 Collections: బాక్సాఫీస్ వద్ద ‘డెకాయిట్' వేట.. అడివి శేష్ మూవీకి ఎన్ని కోట్లంటే ?

Dacoit Box Office Collection: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ డెకాయిట్ (Dacoit). ఈ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. లవ్, ఫ్యామిలీ, యాక్షన్, రొమాన్స్ మేళవింపుతో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే టీజర్, ట్రైలర్‌లతో మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. అంచనాలకు తగినట్టుగానే విడుదల తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్స్ అందుకుంటుంది. ఈ నేపథ్యంలో డెకాయిట్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది? మూడో రోజు అంచనా కలెక్షన్లు ఎంతంటే?

డెకాయిట్ మూవీకి దర్శకుడు షానీ డియో (షాని డియో) కాగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్‌లు నిర్మించారు. కథ, స్క్రీన్‌ప్లేను అడివి శేష్ స్వయంగా దర్శకుడితో కలిసి రూపొందించారు, డైలాగ్స్‌ను అబ్బూరి రవి అందించారు. సినిమాటోగ్రఫీ ధనుష్ భాస్కర్, సంగీతం భీమ్స్ సిసిరోలియో, ఎడిటింగ్‌ను కోదాటి పవన్ కళ్యాణ్ చేసారు. నటినటుల పరంగా కూడా ఈ సినిమా బలంగా నిలిచింది. అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించి సినిమాకు అదనపు బలం చేకూర్చారు.

Dacoit Day 3 Expected Box Office Collections Worldwide Adivi Sesh Film Box Office Report

ఇక బడ్జెట్ పరంగా చూస్తే, 'డెకాయిట్' దాదాపు రూ.70 కోట్ల వ్యయంతో తెరకెక్కినట్లు సమాచారం. థియేట్రికల్ బిజినెస్ విషయంలో తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా దాదాపు రూ.20 కోట్ల మేర బిజినెస్ చేసింది. అందులో ఆంధ్రా ప్రాంతం నుంచి రూ.10 కోట్లు, నైజాం నుంచి రూ.7 కోట్లు, సీడెడ్ నుంచి రూ.3 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ మార్కెట్లలో కలిపి మరో రూ.10 కోట్ల వరకు బిజినెస్ జరిగి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ నమోదైంది. ఈ లెక్కల ప్రకారం, 'డెకాయిట్' సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.32 కోట్ల షేర్ వసూలు చేయాలి. గ్రాస్ కలెక్షన్ల పరంగా చూస్తే దాదాపు రూ.65 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుంది.

ఇక డెకాయిట్ మూవీ ఇక కలెక్షన్ల పరంగా డీసెంట్ ఓపెనింగ్స్ అందుకుంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. మొదటి రోజు ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ. 6.50 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, దేశవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్ రూ.8.25 కోట్లకు చేరాయి. రెండో రోజు (Day 2) ఈ సినిమా సుమారు రూ.8.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో రెండు రోజుల్లో మొత్తం కలెక్షన్లు రూ.16.75 కోట్లకు చేరుకున్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే, తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ఎక్కువ వసూళ్లు సాధించింది. ఏపీ,తెలంగాణ కలిపి రూ.10.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇందులో నైజాం ప్రాంతం నుంచి రూ.6.25 కోట్లు, ఆంధ్రా నుంచి రూ.4 కోట్లు, సీడెడ్ నుంచి రూ.0.70 కోట్లు వచ్చినట్లు సమాచారం.

కర్ణాటకలో రూ.2.20 కోట్లు వసూలు కాగా, తమిళనాడు, కేరళ కలిపి కేవలం రూ.35 లక్షలు మాత్రమే రాబట్టడం నిరాశ కలిగించే అంశం. రెస్ట్ ఆఫ్ ఇండియా మార్కెట్ నుంచి రూ.3.25 కోట్లు వచ్చాయి. అయితే.. హిందీ మార్కెట్‌ పై భారీ అంచనాలు పెట్టుకున్న పూర్తిగా నిరాశపరిచింది. ఇక ఓవర్సీస్‌లో డెకాయిట్ దుమ్మురేపుతోందనే చెప్పాలి. యూఎస్‌లో సుమారు 8 లక్షల డాలర్లు (7.45 కోట్లు), ఇతర దేశాల్లో 2 లక్షల డాలర్లు ( 1.86 కోట్లు) కలిపి మొత్తం 1 మిలియన్ డాలర్ల (9.31 కోట్లు) వసూళ్లు సాధించింది. మొత్తంగా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 26 కోట్ల గ్రాస్‌ను అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు.. తాజాగా రెండురోజుల కలెక్షన్స్‌ను మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. మొదటిరోజు అడివి శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ రూ. 15 కోట్లతో రికార్డ్‌ క్రియేట్‌ చేసిన ఈ మూవీ.. రెండోరోజు కూడా అదే రేంజ్‌లో సత్తా చాటింది. ఈ మూవీ రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 28 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

అల్లు అర్జున్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు తెలుసా? బన్నీ ఏం చదువుకున్నారంటే?
ఇక మూడో కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ నుంచి పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతోంది. దీంతో మూడో రోజు (Day 3) కలెక్షన్లు జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఈ లెక్కన ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఇండియా బాక్సాఫీస్ వద్ద డే 3 నాడు రూ. 7 నుంచి 8 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందట. ఓవర్సీస్ లో కూడా 2 కోట్లకు పైగా వసూలు అందుకునే అవకాశముందట. ఈ లెక్కన చూస్తే.. ఇండియా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.24 కోట్ల గ్రాస్ , ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు రూ. 34 కోట్ల నుంచి రూ. 35 కోట్ల వరకు చేసుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ లెక్కన చూస్తే.. తొలివారంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయంగా కనిపిస్తున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X