పోకిరిగా డేవిడ్ వార్నర్‌.. నా సినిమాలో నటించు.. పూరీ జగన్నాథ్ బంపర్ ఆఫర్

క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఫ్యామిలీ ఇప్పుడు టిక్‌టాక్‌లో వీడియోలతో మోత మోగిస్తున్నారు. అల వైకుంఠపురంలోని చిత్రంలో బుట్టబొమ్మ పాటకు భార్య, పిల్లాడితో చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియో గురించి అల్లు అర్జున్‌తోపాటు పలువురు ప్రముఖులు, నెటిజన్లు, ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అదే ఊపులో డేవిడ్ వార్నర్ మరో టిక్ టాక్ వీడియోతో ఆలరించారు.

తాజాగా పోకిరి సినిమాలోని డైలాగ్‌తో దుమ్ము రేపారు. క్రికెట్ బ్యాట్ చేతిలో పట్టుకొని ఒక్కసారి నేను కమిట్ అయితే నా మాట నేను వినను అంటూ సీరియస్ డైలాగ్‌తో ఫ్యాన్స్‌ను మైమరిపించారు. అంతటితో ఆగకుండా ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది. ఎవరైనా చెప్పగలరా. గుడ్ లక్ అంటూ డేవిడ్ వార్నర్ నెటిజన్లకు ఓ క్విజ్ పెట్టారు. తన టిక్ టాక్ వీడియోను తన అఫీషియల్ ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇన్స్‌టాలో మంచి స్పందన కనిపిస్తున్నది.

David Warners Pokiri Dailogue tik Tak video goes viral

పోకిరి సినిమాతో టిక్ టాక్ వీడియోను చేసిన డేవిడ్ వార్నర్‌పై దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పందించారు. టిక్ టాక్ వీడియో చేయడంలో ఆయన డెడికేషన్ బాగుంది. తెలుగు సినిమాలతో కనెక్ట్ కావడం ఆకట్టుకొంటున్నది. ఈ డైలాగ్ నీకు బాగా సూటయింది. నీలో ఫెంటాస్టిక్ యాక్టర్ కూడా ఉన్నారు. వీలైతే, కాలం కలిసి వస్తే నా సినిమాలో అతిథి పాత్ర చేయాలి. లవ్ యూ అంటూ పూరీ ట్వీట్ చేశారు.

క్రికెటర్‌గా మైదానంలో బౌలర్లను బెంబేలెత్తించే డేవిడ్ వార్నర్ ప్రస్తుతం కరోనా క్వారంటైన్‌లో ఉన్నారు. భార్య కాండైస్ వార్నర్, కూతురు ఐవీ మే, ఇండీ రే, ఇస్లా రోస్‌తో టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో ఆట విడుపుగా తెలుగు సినిమాల డైలాగ్స్, పాటలతో టిక్‌టాక్ చేస్తున్నారు. ఇలా తెలుగు సినిమాలపై వ్యామోహం పెంచుకొంటున్న డేవిడ్ వార్నర్‌ను చూస్తే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినాక యాక్టింగ్ దృష్టిపెడుతున్నారా అనే అనుమానం ఎవరికైనా కలుగక మానదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X