షేక్ చేస్తున్న నిధి అందాలు, నభా నాట్యాలు.. రామ్ రెచ్చిపోయాడుగా!
వరుస పరాజయాలతో డౌన్ ఫాల్‌లో ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ మంచి విజయం కోసం తాపత్రయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఛార్మితో కలిసి సూపర్ స్కెచ్ వేసిన ఈ డాషింగ్ డైరెక్టర్ మాంచి మాస్ మసాలా సినిమాను రూపొందించాలని ఫిక్స్ అయ్యారు. తన ఆలోచనలకు పదును పెడుతూ ప్రస్తుతం రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమా తెరకెక్కిస్తున్నారు పూరి. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు రావడంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు.

మాస్ మసాలా ఐటెం..
చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రం లోని మాస్ మసాలా ఐటెం సాంగ్ 'దిమాక్ ఖరాబ్' పాత లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియొ చూస్తుంటే మాస్ ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉన్న ఈ సాంగ్ థియేటర్లను ఈలలతో గోల పెట్టించడం ఖాయం అనిపిస్తోంది. మణిశర్మ అందించిన బాణీల్లో హీరో రామ్.. ఇద్దరు అందాల భామలతో ఓ రేంజ్‌లో రొమాన్స్ చేసేశాడు.
పూరి మార్క్ డబుల్ చేశారు
సాధారణంగా పూరి స్టైల్ లో పాటలంటేనే యూత్ ఆడియన్స్ కి యమ కిక్కు. అలాంటిది హిట్ కోసం మాంచి కాకమీద ఉన్న పూరి, ఆయనకు తోడుగా యూత్ ఆడియన్స్ పల్స్ తెలిసిన ఛార్మి కలవడంతో ఈ సాంగ్ తమదైన కోణంలో యూత్ ఆడియన్స్ మతిపోగెట్టేలా రూపొందించారు. ఎప్పటిగానే హీరోయిన్స్ అందాల ఆరబోతను కట్టడి చేయని పూరి.. ఆ విషయంలో తన మార్క్ డబుల్ చేశారని చెప్పుకోవచ్చు.

జిల్లేలమ్మ జిట్టా పిల్లా పాలా పిట్టా
తెలంగాణ యాస.. హీరోయిన్స్ అందాలు, రామ్ ఎనర్జిటిక్ చిందులు ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్. ''జిల్లేలమ్మ జిట్టా పిల్లా పాలా పిట్టా'' అనే తెలంగాణ పదాలు పాటలో బాగా హైలైట్ అవుతున్నాయి. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యంలో కీర్తన శర్మ, సాకేత్ ఆలాపన బాగా ఆకట్టుకుంటోంది. మణిశర్మ బాణీలు యువతను ఉర్రూతలూగిస్తున్నాయి.

ఇద్దరు భామలతో రెచ్చిపోయిన యంగ్ హీరో
ఇక సాంగ్ లో ఇద్దరు భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ లతో రెచ్చిపోయి స్టెప్పులేశాడు హీరో రామ్. ఆ ఇద్దరు యంగ్ హీరోయిన్ల అందాలు బాగా ఫోకస్ చేస్తూ పాటకు మరింత హైప్ తీసుకొచ్చారు పూరి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో నిధి అగర్వాల్, నభా నటేష్ ఎక్కడా తగ్గకుండా పర్‌ఫార్మ్ చేశారు. మొత్తానికి ఈ లిరికల్ సాంగ్ తోనే ద్వారా సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది చిత్రయూనిట్.

ఇస్మార్ట్ శంకర్ మూవీ
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు ''డబుల్ దిమాక్'' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తుండగా.. నిధి అగర్వాల్, నభా నటేష్ ఆయనతో చిందులేస్తున్నారు. జులై 12 వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











