ప్రభాస్ మాటలకు అందరి ముందే కన్నీళ్లు పెట్టుకున్న పూరి జగన్నాథ్.. స్పెషల్ బాండింగ్
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమా ఈ నెల 29న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇక ట్రైలర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్ చిత్ర యూనిట్ తో ప్రత్యేకంగా మాట్లాడిన వీడియోను కూడా విడుదల చేశారు. అయితే ఆ వీడియో ను లాంచ్ చేసిన పూరి జగన్నాథ్ ప్రభాస్ మాటలకు ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని టచ్ చేసింది. ప్రభాస్ తన కొడుకు పై పాజిటివ్ గా కామెంట్ చేయడం తో పూరి జగన్నాధ్ ఎప్పుడూ లేని విధంగా కాస్త ఎమోషనల్ అయినట్లు కనిపించాడు.

రొమాంటిక్ సినిమాతో హిట్టు కొట్టాలని..
ఆకాష్ పూరి ఇదివరకే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహబూబా అనే సినిమా చేశాడు. పాజిటివ్ వైబ్రేషన్స్ తో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని రొమాంటిక్ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సినిమాని మొదట నవంబర్ 4న విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం కాస్త ముందుగానే ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పూరి జగన్నాథ్ కథ మాటల స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాను ఆయన శిష్యుడు అనిల్ దర్శకత్వం వహించగా కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది.
ప్రభాస్ విడుదల చేసిన ట్రైలర్
ఇక సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ చేతులమీదుగా విడుదల చేశారు. అయితే పూరి జగన్నాథ్ అడగక ముందే ఈ సినిమాకు ఏ విధంగా అయినా తన వంతు సహాయం చేస్తానని ప్రభాస్ రిక్వెస్ట్ చేశాడట. అంతే కాకుండా కేవలం ట్రైలర్ మాత్రమే విడుదల చేయకుండా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది అని కూడా తన వంతు సపోర్ట్ చేశాడు. ప్రభాస్ ఆకాష్ పూరి పై చాలా పాజిటివ్ గా కామెంట్ చేశాడు.

పూరితో స్పెషల్ బాండింగ్
పూరి జగన్నాథ్ తో ప్రభాస్ కు మంచి స్నేహమే ఉంది. వీరి కలయికలో బుజ్జిగాడు - ఏక్ నిరంజన్ సినిమాలు వచ్చాయి. అయితే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వక పోయినప్పటికీ ప్రభాస్ మాత్రం పూరికి మంచి స్నేహితుడు అయ్యాడు. అందరికంటే ఎక్కువగా అతనిని డార్లింగ్ అంటూ ప్రేమగా పిలుస్తూ రెగ్యులర్ గా కలుసుకుంటాడు. ఇక ఆ బాండింగ్ ఉండడం వల్లనే రొమాంటిక్ సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన ప్రభాస్ అడగకముందే ప్రమోషన్ లో పాల్గొన్నారు.

ఎమోషనల్ అయిన పూరి జగన్నాథ్
ఇక ఆకాష్ చాలా మంచి నటుడు అంటూ సినిమా ట్రైలర్ కూడా అద్భుతంగా ఉందని ఎంతో అనుభవం ఉన్న హీరోగా నటించాడు అని ప్రభాస్ సంతోషంగా తెలియజేశాడు. ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలని ముఖ్యంగా నా డార్లింగ్ అభిమానులతో పాటు ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోల అభిమానులు కూడా చూడాలని ప్రభాస్ ప్రత్యేకంగా కోరుకున్నాడు. ఇక ప్రభాస్ చెప్పిన మాటలకు పూరి జగన్నాథ్ ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నాడు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఆయన ఎమోషనల్ అయ్యారని అనిపిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











